మన రూ.10వేలకు అక్కడ ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా?

Venezuela Currency Crisis : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెనిజులా పేరు మారుమోగుతోంది. అమెరికా కేవలం 30 నిమిషాల్లో జరిపిన మెరుపు దాడిలో అక్కడి అధ్యక్షుడు నికోలస్ మాదురో దంపతులు అరెస్టవ్వడం సంచలనం సృష్టించింది. ఈ రాజకీయ సంక్షోభం పక్కన పెడితే, సామాన్యుడికి వచ్చే పెద్ద డౌట్ ఒకటి ఉంది.. అదేంటంటే, ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు నిల్వలున్న ఈ దేశం ఇంతలా ఎందుకు దివాళా తీసింది? మన 10 వేల రూపాయలు తీసుకుని అక్కడికి వెళ్తే మనం ఎంత ధనవంతులం అవుతాం? ఈ ఆసక్తికరమైన లెక్కలు తెలుసుకుందాం.

వెనిజులా కథ వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఈ దేశం వద్ద ఉన్న ముడి చమురు నిల్వలు ప్రపంచంలోనే అత్యధికం. అంటే సౌదీ అరేబియా కంటే కూడా ఎక్కువ చమురు ఇక్కడే ఉంది. కానీ, దారుణమైన ఆర్థిక విధానాలు, అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఆ సంపదను వాడుకోలేక దేశం అప్పుల్లో కూరుకుపోయింది. 2017లోనే ఈ దేశం చేతులెత్తేసి దివాళా తీసింది. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక కిలో బియ్యం లేదా పాలు కొనాలన్నా సంచుల నిండా నోట్ల కట్టలు పట్టుకెళ్లాల్సిందే. ద్రవ్యోల్బణం ఎంతలా పెరిగిందంటే, అక్కడి కరెన్సీకి విలువ లేకుండా పోయింది.

ఇప్పుడు అసలు లెక్కలోకి వద్దాం. భారత రూపాయి వెనిజులా కరెన్సీ అయిన బోలివర్(VES) కంటే చాలా బలంగా ఉంది. 2025-26 ప్రస్తుత మార్కెట్ విలువల ప్రకారం.. ఒక భారత రూపాయి సుమారు 3.22 వెనిజులా బోలివర్లకు సమానం. ఈ లెక్కన మీరు మీ జేబులో రూ.10,000 వేసుకుని వెనిజులా వెళ్తే, అక్కడ మీకు సుమారు 32,200 నుంచి 32,500 బోలివర్లు వస్తాయి. వినడానికి ఇది పెద్ద మొత్తంగా అనిపించినా, అక్కడ ఒక సామాన్యమైన పూట భోజనం చేయాలన్నా లేదా నిత్యావసరాలు కొనాలన్నా ఈ 32 వేల బోలివర్లు మంచులా కరిగిపోతాయి. అంటే మన దగ్గర పదివేలకు వచ్చే వస్తువుల్లో అక్కడ పదో వంతు కూడా రాకపోవచ్చు.

భారతదేశానికి, వెనిజులాకు మధ్య చమురు వ్యాపారం దశాబ్దాలుగా కొనసాగుతోంది. 2024లో భారత్ అక్కడి నుంచి సుమారు 22 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. అమెరికా తాజా చర్యల తర్వాత ఈ చమురు సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల యజమానులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే ఆ సెగ మనకూ తగులుతుంది. కరెన్సీ విలువలు పడిపోయిన దేశాల్లో ప్రజల జీవనం ఎంత నరకప్రాయంగా ఉంటుందో వెనిజులాను చూస్తే అర్థమవుతుంది. నోట్ల గడ్డలున్నా కొనుక్కోవడానికి తిండి దొరకని పరిస్థితి అక్కడ నెలకొంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story