ఇకపై మెసేజ్‌లలో తప్పులుండవు

WhatsApp : యూజర్ల సౌలభ్యం కోసం వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కంపెనీ కొత్తగా AI రైటింగ్ హెల్ప్ అనే ఫీచర్‌ను జోడించింది. ఈ ఫీచర్ మీ మెసేజ్‌లను మరింత స్మార్ట్‌గా రాయడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారితంగా పనిచేస్తుంది. ఇది మెసేజ్‌ల స్టైల్ మెరుగుపరచడానికి రూపొందించబడింది. అంతేకాకుండా ఈ ఫీచర్ పూర్తిగా ప్రైవసీని అందిస్తుంది. కూడా నిర్ధారిస్తుంది. ఈ ఫీచర్ మెటా ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇది మెసేజ్‌లను ప్రొఫెషనల్, ఫన్నీ లేదా సపోర్టివ్ వంటి వేర్వేరు స్టైల్స్ లో తిరిగి రాయడానికి సూచనలు ఇస్తుంది.

ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?

ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి మీరు ఒకరితో లేదా గ్రూప్ చాట్‌లో ఒక మెసేజ్ రాయడం మొదలుపెట్టాలి. తర్వాత మీరు రాసిన మెసేజ్‌ను అసంపూర్తిగా వదిలేస్తే, మీకు ఒక పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఒక పాప్‌-అప్ విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ మెసేజ్ ఇతర వెర్షన్లు కనిపిస్తాయి. అందులో మీరు ఏదైనా ఒక సూచనను ఎంచుకోవచ్చు. అది మీ మెసేజ్‌ను ఆటోమేటిక్‌గా మారుస్తుంది. ఈ ఫీచర్‌ను తీసుకురావడం వెనుక మెటా లక్ష్యం, సరైన పదాలను వెతకడంలో ఉండే కష్టాన్ని తగ్గించి, మెసేజ్‌లు పంపడాన్ని సులభతరం చేయడం.

ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉందా?

ఈ ఫీచర్ పూర్తిగా ఐచ్ఛికమని, సాధారణంగా డిసేబుల్‌లో ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. మీరు ఈ ఫీచర్‌ను ఉపయోగించాలనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. మొదట ఈ ఫీచర్ అమెరికాలో, కొన్ని సెలెక్టెడ్ దేశాలలో ఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని మెటా వెల్లడించింది. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ కొత్త ఫీచర్‌ను ఇతర దేశాలలో కూడా తీసుకురావడానికి మెటా సన్నాహాలు చేస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story