2025లో వచ్చిన టాప్ ఫీచర్లు ఇవే!

WhatsApp : మెసేజింగ్ యాప్ అనగానే మన అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు వాట్సాప్. యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేయడం దీని ప్రత్యేకత. 2025లో వాట్సాప్ తన రూపురేఖలను పూర్తిగా మార్చేస్తూ అదిరిపోయే అప్‌డేట్స్‌ను తీసుకొచ్చింది. ప్రైవసీ నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ వరకు వాట్సాప్ చాటింగ్ ఇప్పుడు మరింత సరదాగా, సులభంగా మారిపోయింది. మరి ఈ ఏడాది లాంచ్ అయిన ఆ టాప్ ఫీచర్లు ఏంటో మీరు కూడా తెలుసుకోండి.

ఇకపై వాట్సాప్ కేవలం మెసేజ్‌లకే పరిమితం కాదు. వీడియో కాల్ చేస్తున్నప్పుడు మీ మొబైల్ స్క్రీన్‌ను అవతలి వారికి షేర్ చేయవచ్చు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. దీనివల్ల ఆఫీస్ ప్రెజెంటేషన్లు లేదా టెక్నికల్ సాయం చేయడం ఈజీ అవుతుంది. అంతేకాకుండా, గూగుల్ మీట్ లాగా వాట్సాప్ కాల్స్‌ను కూడా ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. కాల్ మొదలయ్యే ముందు మీకు రిమైండర్ కూడా వస్తుంది. గ్రూప్ కాల్స్‌లో రైజ్ హ్యాండ్, ఇమోజీ రియాక్షన్ల ఫీచర్లను కూడా వాట్సాప్ జత చేసింది.

వందల కొద్దీ చాట్స్ మధ్యలో మనకు ముఖ్యమైన వారి మెసేజ్‌లు వెతకడం కష్టమవుతుంది. అందుకే వాట్సాప్ ఫేవరెట్స్ ట్యాబ్‌ను తెచ్చింది. మీకు నచ్చిన వ్యక్తులను లేదా గ్రూపులను ఇందులో పెట్టుకుంటే నేరుగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం చాట్‌లోనే డాక్యుమెంట్ స్కాన్ చేసే ఆప్షన్ ఇచ్చింది. విదేశీ భాషల్లో వచ్చే మెసేజ్‌లను చదవడానికి ఇబ్బంది పడకుండా, మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ద్వారా మీకు నచ్చిన భాషలోకి మార్చుకోవచ్చు.

చాటింగ్ బోర్ కొట్టకుండా వాట్సాప్ సరికొత్త ఎనిమేటెడ్ ఎమోజీలను ప్రవేశపెట్టింది. మీరు ఎమోజీ పంపినప్పుడు అది కదులుతూ మరింత ఎక్స్‌ప్రెసివ్‌గా కనిపిస్తుంది. అలాగే మీ గ్యాలరీలోని చిన్న చిన్న వీడియోలను స్టిక్కర్లుగా మార్చుకునే స్టిక్కర్ మేకర్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారింది. మెటా ఏఐ సాయంతో మీ చాట్ విండో రంగులు, థీమ్స్‌ను మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. లైవ్ ఫోటోలు, మోషన్ ఫోటోలను కూడా క్వాలిటీ తగ్గకుండా పంపే వీలుంది.

వాట్సాప్ సేఫ్టీ విషయంలో మరో మెట్టు ఎక్కింది. మీ చాట్ బ్యాకప్‌లను సురక్షితంగా ఉంచడానికి పాస్‌కీ ఫీచర్‌ను తెచ్చింది. మీ వేలిముద్ర లేదా ఫేస్ ఐడీతో మాత్రమే మీ బ్యాకప్‌ను ఓపెన్ చేసేలా దీనిని రూపొందించారు. అలాగే ఏ చాటింగ్ డేటా ఏఐకి యాక్సెస్ ఉండాలి, ఏది ఉండకూడదు అనే దానిపై యూజర్లకే పూర్తి నియంత్రణ ఇచ్చింది. మొత్తం మీద 2025లో వాట్సాప్ సరికొత్త అవతారమెత్తి యూజర్ల మనసు గెలుచుకుంటోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story