WhatsApp Web Alert: కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) హెచ్చరించింది. ముఖ్యంగా ఆఫీస్ కంప్యూటర్లు, సైబర్ కేఫ్‌లు, హోటళ్లలోని కంప్యూటర్లు, ఇతరులు ఉపయోగించే సిస్టమ్‌లలో fe ఓపెన్ చేసి వదిలేయడం ప్రమాదకరమని స్పష్టం చేసింది. ఇలాంటి కంప్యూటర్లలో లాగిన్ సెషన్ అలాగే ఉంటే ఇతరులు మీ వ్యక్తిగత చాట్స్ చదవడం, మీ పేరు మీద మెసేజ్‌లు పంపడం వంటి పనులు చేసే అవకాశం ఉంది. మీ స్నేహితులు, బంధువుల దగ్గర డబ్బులు అడిగి మోసాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 23న I4C పరిధిలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) ప్రత్యేక హెచ్చరిక జారీ చేసింది.

వాట్సాప్ వెబ్‌తో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది?

కంప్యూటర్‌లో వాట్సాప్ వెబ్‌కు ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఆ సెషన్‌ను సరిగ్గా క్లోజ్ చేయకపోతే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ కంప్యూటర్‌ను తర్వాత ఉపయోగించే వ్యక్తికి మీ వాట్సాప్ అకౌంట్ తెరిచి ఉంటే, మీ వ్యక్తిగత మెసేజ్‌లు, కాంటాక్టులు, గ్రూప్ చాట్స్ చూసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీ అకౌంట్ నుంచే ఇతరులకు మెసేజ్‌లు పంపవచ్చు. మీ పేరు, మీ పరిచయాలను ఉపయోగించి స్నేహితులు, కుటుంబ సభ్యుల దగ్గర అత్యవసరంగా డబ్బులు కావాలని అడగవచ్చు. మీకు తెలిసిన వ్యక్తి నుంచే మెసేజ్ వచ్చినట్లు కనిపించడంతో వారు నమ్మి డబ్బులు పంపే ప్రమాదం ఉంది. ఫిషింగ్ లింకులు పంపడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వంటి పనులకు కూడా మీ అకౌంట్‌ను ఉపయోగించవచ్చు. అందుకే లాగిన్ అయిన కంప్యూటర్ ఎవరెవరు ఉపయోగిస్తున్నారనే విషయం చాలా ముఖ్యం.

ఈ ప్రదేశాల్లో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయొద్దు

సైబర్ కేఫ్‌లు, హోటల్ బిజినెస్ సెంటర్లు, పబ్లిక్ కంప్యూటర్ కియోస్క్‌లు, ఇతరుల నుంచి అప్పుగా తీసుకున్న ల్యాప్‌టాప్‌లు వంటి నమ్మకం లేని పరికరాల్లో వాట్సాప్ వెబ్ వాడకూడదని I4C సూచించింది. ముఖ్యంగా ప్రభుత్వ, ఆఫీస్, ఆర్థిక, వ్యక్తిగత రహస్య సమాచారాన్ని కంప్యూటర్‌లోని వాట్సాప్ వెబ్ ద్వారా పంపించకపోవడం మంచిది. ఆఫీస్‌లో అందరూ ఉపయోగించే కంప్యూటర్లలో వాట్సాప్‌ను ఎప్పుడూ లాగిన్‌లో ఉంచకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో వాట్సాప్ వెబ్ ఉపయోగించాల్సి వస్తే నమ్మకమైన కంప్యూటర్‌లోనే వాడాలి. బ్రౌజర్‌లో Incognito లేదా ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్‌ను ఎంచుకోవాలి. అయితే ఈ మోడ్ ఉపయోగించినంత మాత్రాన అకౌంట్ పూర్తిగా సురక్షితమైందని భావించకూడదు. పని పూర్తయ్యాక తప్పనిసరిగా లాగౌట్ చేయాలి.

ట్యాబ్ క్లోజ్ చేస్తే సరిపోదు.. ఇలా లాగౌట్ చేయండి

చాలామంది వాట్సాప్ వెబ్‌లో పని పూర్తయ్యాక బ్రౌజర్ ట్యాబ్ లేదా విండోను మూసేసి వెళ్లిపోతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అకౌంట్ నుంచి లాగౌట్ అయినట్లు కాదు. లాగిన్ సెషన్ కొనసాగవచ్చు. అందుకే వాట్సాప్ వెబ్‌లోనే మెనూ ఓపెన్ చేసి Log out ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఒకవేళ ఇప్పటికే వేరే కంప్యూటర్‌లో లాగిన్ చేసి వచ్చి, అక్కడ లాగౌట్ చేశామో లేదో గుర్తులేకపోతే మీ ఫోన్‌లోనే ఆ సెషన్‌ను ముగించవచ్చు. ఇందుకోసం ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేసి Settings లేదా మూడు చుక్కల మెనూలో Linked Devices ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ లాగిన్ అయిన పరికరాల జాబితా కనిపిస్తుంది. మీకు తెలియని లేదా ప్రస్తుతం అవసరం లేని పరికరాన్ని ఎంచుకుని Log out నొక్కాలి. ఇలా చేస్తే ఆ పరికరంతో ఉన్న లింక్ తొలగిపోతుంది.

మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందని ఎలా గుర్తించాలి?

మీరు పంపని మెసేజ్‌లు మీ అకౌంట్ నుంచి ఇతరులకు వెళ్తున్నాయా? మీరు పంపినట్లు చెబుతూ స్నేహితులు వింత మెసేజ్‌ల గురించి అడుగుతున్నారా? మీకు తెలియని పరికరాలు Linked Devices జాబితాలో కనిపిస్తున్నాయా? ఇలాంటి విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి అకౌంట్‌ను ఇతరులు ఉపయోగిస్తున్నారనే అనుమానానికి కారణం కావచ్చు. వెంటనే Linked Devices విభాగంలోకి వెళ్లి గుర్తు తెలియని పరికరాల నుంచి లాగౌట్ చేయాలి. మీ ఫోన్‌కు వచ్చే OTP లేదా లింకింగ్ కోడ్‌లను ఇతరులతో పంచుకోవద్దు. అనుమానాస్పద ఫైల్స్, తెలియని డౌన్‌లోడ్లు, క్రాక్ చేసిన సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉండాలి. ఫోన్, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి.

సైబర్ మోసం జరిగితే వెంటనే ఏం చేయ…

Next Story