రూ.76 లక్షల కోట్ల రుణాలతో సరికొత్త రికార్డు

Women Entrepreneurs : భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తల హవా నడుస్తోంది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం.. 2025 నాటికి మహిళలు తీసుకున్న మొత్తం రుణాల విలువ ఏకంగా రూ.76 లక్షల కోట్లకు చేరింది. ఇది దేశం మొత్తం మీద తీసుకున్న అప్పుల్లో సుమారు 26 శాతం కావడం విశేషం. 2017 నుంచి చూస్తే ఈ గ్రోత్ 4.8 రెట్లు పెరిగింది. అంటే మహిళలు కేవలం పొదుపు సంఘాలకే పరిమితం కాకుండా, పెద్ద పెద్ద బిజినెస్ లోన్లు కూడా తీసుకుంటున్నారని స్పష్టమవుతోంది.

డిజిటల్ విప్లవంతో పెరిగిన జోరు

ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాలన్నా, లోన్ అప్లై చేయాలన్నా మహిళలకు చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఇప్పుడు డిజిటల్ సిస్టమ్ అంతా మార్చేసింది. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, ఇంట్లో కూర్చునే లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. యూపీఐ పేమెంట్స్, ఆన్‌లైన్ వెరిఫికేషన్ వల్ల ప్రాసెస్ చాలా సులభం అయిపోయింది. దీనివల్ల మధ్యవర్తుల బెడద తగ్గి, నేరుగా బ్యాంకుల నుంచి లోన్లు పొందే సదుపాయం పెరిగింది.

వ్యాపార రుణాల్లో 7.5 రెట్ల పెరుగుదల

మహిళలు ఇప్పుడు కేవలం ఇల్లు గడపడానికో లేదా చిన్న అవసరాలకో అప్పులు చేయడం లేదు. బిజినెస్ లోన్లు తీసుకోవడంలో మహిళలు ఏకంగా 7.5 శాతం వృద్ధిని నమోదు చేశారు. సొంతంగా స్టార్టప్స్ పెట్టడం, ఉన్న బిజినెస్‌ను విస్తరించడం వంటి పనులపై వారు దృష్టి పెడుతున్నారు. సుమారు 16 కోట్ల మంది మహిళలు ప్రస్తుతం యాక్టివ్ లోన్ హోల్డర్లుగా ఉన్నారని నివేదిక వెల్లడించింది.

ఇంకా చేయాల్సింది చాలా ఉంది

మహిళల ఆర్థిక భాగస్వామ్యం పెరుగుతున్నా, ఇంకా 18 నుంచి 64 ఏళ్ల మధ్య వయసున్న సుమారు మూడింట రెండొంతుల మంది మహిళలకు బ్యాంకింగ్ లోన్లు అందుబాటులోకి రాలేదు. 35 ఏళ్లలోపు యువతులకు ప్రత్యేకంగా లోన్ స్కీమ్స్ తీసుకురావడం, డిజిటల్ అవేర్‌నెస్ పెంచడం వంటివి చేస్తే భారత జీడీపీలో మహిళల వాటా మరింత పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story