నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆయన తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేస్తున్నాడని తూర్పుగోదావరి జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణ మండిపడ్డారు. ధియేటర్ల బందు ప్రతిపాదన జనసేన పార్టీకే చెందిన తూర్పుగోదావరి ఎగ్జిబిటర్ అనుశ్రీ సత్యనారాయణే మొదట ప్రస్తావించారని రెండు రోజుల క్రితం టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ ప్రెస్ మీట్ లో దిల్ రాజు సత్యనారాయణ పేరును ప్రస్తావించడంతో ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో ఈ రోజు రాజమండ్రీలో ప్రెస్ మీట్ పెట్టిన సత్యనారాయణ నిర్మాత దిల్ రాజుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా ధియేటర్లు బందు చెయ్యాలని తాను ఎక్కడా ప్రస్తావించ లేదని అనుశ్రీ సత్యనారాయణ ఈ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు. అంతే కాండా అసలు ధియేటర్లు బంద్ చేయాలని ముందుగా ప్రకటించిందే దిల్ రాజ్ తమ్ముడు శిరీష్ రెడ్డి అని సత్యనారాయణ బాంబు పేల్చారు. తన తమ్ముడ్ని కాపాడుకోవడానికే దిల్ రాజు నాపై నిందలు వేస్తున్నాడని సత్యనారాయణ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వగానే దిల్ రాజు కమల్ హసన్ ని మించిపోయేలా నటించి జనసేన పార్టీ పేరు ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చాడని అనుశ్రీ సత్యనారాయణ దిల్ రాజుపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story