మణికొండ నివాసంలో శివశక్తి దత్తా మృతి

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో విషాదం నెలకొంది. కీరవాణి తండ్రి, రచయిత, కథకుడు, ద్శకుడు శివశక్తి దత్తా (92) సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. శివశక్తి దత్త కుటుంబం తెలుగు సినీ పరిశ్రమలో శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నారు. ప్రముఖ సినీ రచయిత విజేంద్రప్రసాద్‌ ఆయనకు సోదరుడు. అలాగే పాన్‌ ఇండియా డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి, మ్యూజికల్‌ డైరెక్టర్లు శ్రీలేఖ. కళ్యాణి మాలిక్‌ లు కూడా శివశక్తి దత్తా కుటుంబ సభ్యులే. శివశక్తి దతతా అసలు పేరు కోడూరి సుబ్బారివు. 1932 అక్టోబర్‌ 8వ తేదీన కొవ్వూరులో ఆయన జన్మించారు. సోదరుడు విజయేంద్రప్రసాద్‌ తో కలసి ఆయన 1988లో సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగు సినీ పరిశ్రలో సూపర్‌ హిట్లైన ఛత్రపతి, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, హనుమాన్‌, రాజన్న తదితర చిత్రాలకు ఆయన పాటలు రాశారు. కొన్ని చిత్రాలకు స్క్రీన్‌ ప్లేలు కూడా సమకూర్చారు. నాగార్జున రచించిన జానకిరాముడు సినిమాకు రచయితాగా పనిచేసిన శివశక్తి దత్తా చంద్రహాస్‌ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. శివశక్తాదత్తా మరణించడంతో మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, దర్శకుడు రాజమౌళి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు శవశక్తి దత్తా మరణం పట్ల దిగ్భ్రంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story