Dhurandhar 2': బాక్సాఫీస్ వద్ద రణ్‌వీర్ సింగ్ ధురందర ప్రస్థానం కొనసాగుతోంది. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ విజువల్ వండర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించి, బాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న అధికారిక లెక్కల ప్రకారం.. 'ధురంధర్ 2' ప్రపంచవ్యాప్తంగా ఈ 100 రోజుల్లో ఏకంగా రూ.1,813.38 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకొని నిర్మాణ సంస్థ 'జియో స్టూడియోస్' సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక పోస్ట్‌ను షేర్ చేస్తూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

గతేడాది డిసెంబరు 5న విడుదలైన మొదటి భాగం 'ధురంధర్' సూపర్ హిట్ కాగా.. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్ 2’ అంతకు మించిన కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను రూల్ చేసింది. ఇక సినిమా సాధించిన ఈ హిస్టారికల్ సక్సెస్‌పై దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి, ప్రముఖ నటి యామీ గౌతమ్ స్పందించారు.

"ఈ భారీ విజయం మమ్మల్ని ఏమీ మార్చలేదు.. ఆదిత్య ఎప్పుడూ చాలా వినయంగా ఉంటారు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూశాం, కానీ ఎప్పుడూ నిరాశపడలేదు. మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని నమ్ముతాం. మన కోసం రాసిపెట్టింది కాస్త ఆలస్యమైనా.. తప్పకుండా దక్కుతుందని ఈ సినిమా నిరూపించింది" అంటూ యామీ గౌతమ్ ఎమోషనల్ అయ్యారు.

ధూరంధర్ పార్ట్ 1 ఓటీటీలోనూ రికార్డులు సృష్టిస్తోంది. దీని అన్‌కట్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్‌లో మే నెలలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇప్పుడు సీక్వెల్‌కు సంబంధించిన అన్‌కట్, బిహైండ్ ద సీన్స్ (BTS) వెర్షన్ ‘రా & అన్దేఖా - ది రివెంజ్’ కూడా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story