Actress Eva Grover: 18 రోజుల ప్రేమ.. 5 ఏళ్ల నరకం.. గృహ హింసపై ప్రముఖ నటి ఎవా గ్రోవర్ కన్నీటి పర్యంతం..
గృహ హింసపై ప్రముఖ నటి ఎవా గ్రోవర్ కన్నీటి పర్యంతం..

Actress Eva Grover: రెడీ సినిమాతో పాటు కుంకుమ్ వంటి పలు ప్రజాదరణ పొందిన సీరియల్స్‌తో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రముఖ టీవీ నటి ఎవా గ్రోవర్ తన వ్యక్తిగత జీవితం, వివాహ బంధంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం రేపుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సవతి సోదరుడు హైదర్ అలీ ఖాన్‌తో తన పెళ్లి, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న భయంకరమైన గృహ హింస గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి ఆవేదన వ్యక్తం చేశారు.
18 రోజుల పరిచయం.. ఆమిర్ ఖాన్ హెచ్చరించినా..
తొందరపాటు నిర్ణయాలు జీవితాలను ఎలా నరకప్రాయం చేస్తాయో వివరిస్తూ ఎవా గ్రోవర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కేవలం 18 రోజుల పరిచయం, ప్రేమ తర్వాత ఆమె హైదర్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి వద్దని ఆమె తల్లి వారించడమే కాకుండా, స్వయంగా ఆమిర్ ఖాన్ కూడా ఆమెను ముందుగానే హెచ్చరించారు. అందరి మాటలను పక్కనపెట్టి తాను తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల ఒక వ్యక్తిని సరిగ్గా అంచనా వేయడంలో పూర్తిగా పొరపాటు చేశానని ఎవా అంగీకరించారు.
పెళ్లయిన కొద్దిరోజులకే శారీరక దాడులు
పెళ్లయిన కొద్దిరోజులకే భర్త అసలు స్వరూపం బయటపడిందని ఎవా కన్నీటిపర్యంతమయ్యారు. ఆయన తరచూ తనపై శారీరకంగా దాడి చేస్తూ వేధించేవాడని తెలిపారు. ఎలాగైనా బంధం నిలబడుతుందనే ఆశతో ఒక పాపకు జన్మనిచ్చానని, కానీ బిడ్డ పుట్టిన నెలకే వేధింపులు మరీ ఎక్కువ కావడంతో, ఆ పసిపాపను ఎత్తుకుని ఒంటరిగా ఇల్లు వదిలి బయటకు వచ్చేసినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అండగా నిలిచిన ఆమిర్ ఖాన్ కుటుంబం..
ఈ కష్టసమయంలో హైదర్ అలీ ఖాన్ వైపు నుండి కాకుండా ఆమిర్ ఖాన్ కుటుంబం నుండి తనకు నైతిక మద్దతు లభించిందని ఎవా గుర్తుచేసుకున్నారు. ఆమిర్ ఖాన్ తండ్రి, దివంగత నిర్మాత తాహిర్ హుస్సేన్‌తో పాటు ఆమె అత్తగారు షహనాజ్ తనకు ఎంతో మద్దతుగా నిలిచారు. షూటింగ్స్ సమయంలో తోటి నటీనటులు, సీరియల్ యూనిట్ సభ్యులు కూడా తనకు కొండంత అండగా నిలిచారని ఆమె చెప్పారు.
-ఐదేళ్ల నరకయాతన తర్వాత విడాకులు
నిత్యం గృహ హింస, వేధింపుల మధ్య ఐదేళ్ల పాటు నరకయాతన అనుభవించిన తర్వాత.. ఎవా గ్రోవర్ తన భర్త హైదర్‌తో విడాకులు తీసుకుని ఆ బంధం నుండి శాశ్వతంగా బయటపడ్డారు.
- Eva GroverDomestic ViolenceWomen’s RightsCelebrity InterviewAbuse AwarenessEntertainment NewsSocial IssuesPersonal StrugglesSurvivor StoryMental Health AwarenessFamily IssuesBollywood NewsTelevision ActressEmpowermentPublic AwarenessLatest Telugu NewsCelebrity NewsWomen SafetyEmotional RevelationDomestic Abuse Awareness

