అనిల్ రావిపూడి క్రేజీ మల్టీస్టారర్ ఫిక్స్..

Anil Ravipudi’s Crazy Multistarrer: టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తదుపరి బిగ్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ గురించి అనిల్ రావిపూడి స్పందిస్తూ ఒక ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ ట్వీట్ చేశారు.

"నాకు దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ గారితో.. నా కెరీర్‌లో మొదటి 100 కోట్ల సినిమా (F2) అందించిన హీరో వెంకటేష్ గారితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది." అని తెలిపారు.

ముగిసిన ఊహాగానాలు

మెగాస్టార్ చిరంజీవితో మన శంకరవరప్రసాద్ గారు పూర్తి చేసిన తర్వాత, అనిల్ తర్వాతి హీరో ఎవరనే దానిపై రకరకాల పేర్లు వినిపించాయి. చివరకు కళ్యాణ్ రామ్ పేరును ఖరారు చేయడంతో నందమూరి, దగ్గుబాటి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వీరిద్దరి బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా అనిల్ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

టార్గెట్ 2027 సంక్రాంతి

ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. సంక్రాంతి అంటేనే అనిల్ రావిపూడికి కలిసొచ్చే సీజన్ కావడంతో ఈ మల్టీస్టారర్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story