Sun Pictures: 33 రోజుల కోసం రూ. 22 కోట్లు... దీపకానా మాజాకా
దీపకానా మాజాకా

Sun Pictures: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో భారీ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. 'పుష్ప 2: ది రూల్ ' తర్వాత బన్నీ చేయబోయే 22వ సినిమా ఇది. ఇప్పటికే అర్జున్ బర్త్ డే సంద ర్భంగా ఏప్రిల్ 8న టీమ్ దీనిని అధికారికంగా ప్రకటించింది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఫాంటసీ జోనర్లో ఈ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. సినిమాకు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ అందించడానికి ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి సాలిడ్ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఇందులో హీరోయిన్ గా ఎవరు కనిపించనున్నారో అన్నదానిపై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె.. ఇందులో బన్నీకి జోడీగా కనిపించనున్నారని తెలిపారు. ఈ మేరకు స్పెషల్ వీడియో షేర్ చేశారు. దర్శకుడు అట్లీ దీపికాకి కథని చెప్తున్న విజువల్స్ ఇంకా కొన్ని కామికల్ గా బ్లాక్ అండ్ వైట్ లో ఆమెపై చూపించిన విజువల్ పూర్తిగా అవుట్ ఆఫ్ ది బాక్స్ లెవెల్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం దీపకా 33 రోజుల షెడ్యూల్ కోసం ఏకంగా రూ. 22 కోట్లు డిమాండ్ చేసిందట. ప్రభాస్ సినిమాను మిస్ చేసుకున్న ఈ బ్యూటీ బన్నీ సినిమాకు మాత్రం బాగానే డిమాండ్ చేసింది.
