అసలేం జరుగుతోంది.?

IPS Officers at Aamir Khan’s House: ముంబైలోని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఇంటికి సుమారు 25 మంది IPS అధికారులు వచ్చి వెళ్లిన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతోన్నాయి.

అమీర్ ఖాన్ ఇంటికి ఈ ఐపీఎస్ అధికారులు ఎందుకు వచ్చారనేదానిపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. కానీ ట్రైనింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు ఆమిర్ ఖాన్‌ను కలవడానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన ఇంటికి వచ్చిన ఆఫీసర్లకు అమీర్ ఖాన్ ఆథిత్యం ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై ఆమిర్ ఖాన్ లేదా ఆయన బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఆమిర్ ఖాన్ బృందం కూడా దీనిపై పూర్తి సమాచారం తమకు ఇంకా తెలియదని, ఆరా తీస్తున్నామని తెలిపారు.

కొందరు నెటిజన్లు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి అయ్యి ఉంటుందని చర్చించుకుంటున్నారు. మరికొందరు ఇది కేవలం ఒక ఫార్మల్ విజిట్ మాత్రమే కావచ్చని భావిస్తున్నారు.

ఆమిర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలో ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న చిత్రంలో కనిపించనున్నారు. అలాగే ఆగస్టు 14 నుంచి 24 వరకు జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) 2025కి అమీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story