రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ravi Teja Interesting Comments: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించిన మాస్ జాతర ప్రీమియర్స్ మొదలయ్యాయి. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న భాను భోగవరపు, చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాను రవితేజకు వీరాభిమానిని అని భాను తెలిపారు. రవితేజ సినిమాలలో తనకు వెంకీ అంటే చాలా ఇష్టమని, అలాంటిది తన తొలి సినిమా ఆయనతోనే ఉంటుందని తాను అస్సలు ఊహించలేదని ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాకు మాస్ జాతర అనే సాలిడ్ టైటిల్‌ను రవితేజ గారే సూచించారని, అందుకు తగినట్టుగానే సన్నివేశాలను డిజైన్ చేసుకున్నామని చెప్పారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే గట్టి నమ్మకం తనకు ఉందని భాను వ్యక్తం చేశారు.

హైపర్ ఆది: మళ్లీ మళ్లీ నవ్వులు

నటుడు హైపర్ ఆది మాట్లాడుతూ.. ధమాకా చిత్రం తర్వాత నుంచి తాను రవితేజ సినిమాలలో వరుసగా నటిస్తూ వస్తున్నానని తెలిపారు. తమ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ ఆడియన్స్‌కు తప్పకుండా నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

డైరెక్షన్ హైలైట్

తన సినిమా గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టం ఉండని రవితేజ, ఈ సినిమా గురించి మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. "వేరే ఏ విషయం గురించి మాట్లాడమని చెప్పినా మాట్లాడతాను. కానీ నా గురించి.. నా సినిమాను గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు" అని రవితేజ తెలిపారు. "ఇలా వచ్చేస్తున్నాయ్.. అలా వచ్చేస్తున్నాయ్.. బాగా వచ్చేస్తున్నాయ్ అని నేను చెప్పలేను" అన్నారు. అయితే భాను భోగవరపు పనితీరుపై రవితేజ ప్రశంసలు కురిపించారు. ‘‘భాను డైరెక్షన్.. అతని రైటింగ్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందనేది మాత్రం నిజం" అని స్పష్టం చేశారు. ఒకటి మాత్రం చెప్పగలను.. మనకి మరో కమర్షియల్ డైరెక్టర్ వస్తున్నాడని వ్యాఖ్యానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story