యంగ్ హీరోల హాట్ ఫేవరెట్ మానస..

A New Spark in Tollywood: వెండితెరపై ఒక వెలుగు వెలగాలంటే కేవలం అందం, అభినయం ఉంటే సరిపోదు.. దానికి తోడు అదృష్టం కూడా తోడవ్వాలి. ఇది సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో వినిపించే మాట. హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటున్న ఈ రోజుల్లో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సక్సెస్‌గా మార్చుకోవడం చాలా ముఖ్యం. తాజాగా ఈ అదృష్టాన్ని ఒడిసి పట్టుకుని, టాలీవుడ్ దృష్టిని తనవైపు తిప్పుకుంది నాజూకు సుందరి మానసా వారణాసి.

తెలంగాణ నుంచి వెండితెరకు:

మానసా వారణాసి అచ్చమైన తెలంగాణ అమ్మాయి. సినీ రంగంలోకి అడుగుపెట్టకముందే అనేక అందాల పోటీల్లో తన సత్తా చాటి, ఎన్నో బహుమతులను గెలుచుకుంది. మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన ఈ సుందరి, ఇప్పుడు వెండితెరపై మంత్రముగ్ధులను చేస్తోంది.

కపుల్ ఫ్రెండ్లీతో మారిన జాతకం..

తొలి ప్రయత్నం ఎలా ఉన్నా, సరైన హిట్ పడితే దశ తిరిగిపోతుంది అనడానికి మానసనే ఉదాహరణ. కపుల్ ఫ్రెండ్లీ సినిమా తర్వాత ఈ బ్యూటీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఆమె అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పొన్నాగి పూల సోయగంలా, తామర రేకుల రాశిలా కనిపించే ఈ సుందరిపై ఇప్పుడు టాలీవుడ్ కన్ను పడింది.ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మానస ఎంట్రీ ఇవ్వడం ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలంతా తమ సినిమాల కోసం మానసా వారణాసిని రికమెండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

గ్లామర్‌తో పాటు తనదైన టాలెంట్‌తో దూసుకుపోతున్న ఈ భామ, రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సౌందర్యానికి ప్రతిరూపంలా కనిపించే ఈ తెలంగాణ తేజం మున్ముందు ఇంకెన్ని విజయాలను అందుకుంటుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story