A Special Treat for Prabhas Fans: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గిప్ట్!
అభిమానులకు అదిరిపోయే గిప్ట్!

A Special Treat for Prabhas Fans: కొత్త సంవత్సరం సందర్భంగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం 'స్పిరిట్' (Spirit) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈరోజు (జనవరి 1) విడుదల చేశారు. గత కొంతకాలంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లతో సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు తెరదించుతూ, చిత్ర యూనిట్ అధికారికంగా ఈ పోస్టర్‌ను షేర్ చేసింది.
డైరెక్టర్ సందీప్ వంగా ఈ పోస్టర్‌ను ఎక్స్ (X) వేదికగా పంచుకుంటూ, "భారతీయ సినిమా.. మీ ఆజానుబాహుడిని చూడండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా చాలా రగ్గడ్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. షర్ట్ లేకుండా, ఒంటిపై గాయాలు, బ్యాండేజీలతో కిటికీ పక్కన నిలబడగా.. హీరోయిన్ తృప్తి డిమ్రి ఆయన సిగరెట్ వెలిగిస్తున్న దృశ్యం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని సమాచారం.
'యానిమల్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన సందీప్ వంగా, ఈసారి ప్రభాస్‌ను ఎలా చూపిస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది . ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. విదేశీ నటుడు కొరియన్ స్టార్ డాన్ లీ (మా డాంగ్-సియోక్) నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్టును టీ-సిరీస్ , భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఒకవైపు 'స్పిరిట్' అప్‌డేట్లతో హడావిడి మొదలవ్వగా, మరోవైపు ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. 'స్పిరిట్' పోస్టర్ రావడంతో ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా తగిలినట్లయింది.

