విడాకుల పుకార్లపై అభిషేక్ బచ్చన్ రియాక్షన్..

Abhishek Bachchan: బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఎన్నిసార్లు ఖండించినా ఈ వార్తలు ఆగకపోవడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ తన వైవాహిక జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య ఉన్న విడదీయలేని బంధానికి కారణం కేవలం ప్రేమ మాత్రమే కాదు, అంతకు మించి మరొకటి ఉందని ఆయన స్పష్టం చేశారు.

నా కెరీర్ ప్రారంభం నుంచే ఐశ్వర్య నాకు తెలుసు. మేమిద్దరం ముందు నుంచీ మంచి స్నేహితులం. పెళ్లయిన తర్వాత కూడా మా మధ్య ఆ ఫ్రెండ్‌ప్' అలాగే ఉంది. మా బంధం ఇంత కాలం సజావుగా సాగడానికి ఆ స్నేహమే ప్రధాన కారణం. మా కుటుంబంలో అందరం స్నేహితుల్లాగే ఉంటాం. ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అనే పట్టింపులు ఉండవు. మా అమ్మనాన్నల పెళ్లి సమయంలో కూడా నాన్న కంటే అమ్మే పెద్ద స్టార్. కాబట్టి మా ఇంట్లో స్టార్‌డమ్ అనే అంశానికి తావు లేదు. పెళ్లయ్యాక ఇలాగే ఉండాలి, నియమ నిబంధనలు పాటించాలి అనే చర్చలు మా మధ్య ఎప్పుడూ రాలేదు. పెళ్లిని ఒక గొప్ప భాగస్వామ్యంగా భావిస్తాం తప్ప, ఒక భారంగా చూడం అని అభిషేక్ అన్నారు,

PolitEnt Media

PolitEnt Media

Next Story