Action King Arjun: బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న తాజా తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'బ్లాస్ట్', తెలుగులో 'బ్లాస్ట్ జోన్' పేరుతో ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి మరియు ప్రీతి ముఖుందన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మరియు మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. థియేటర్లలో ఏ రకంగానైతే ఈ చిత్రం సంచలనం సృష్టించిందో.. ఇప్పుడు అన్ని ప్రధాన భాషల్లో అందుబాటులో ఉండటం మరియు అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం వల్ల ఓటీటీలో కూడా దీనికి మరింత పెద్ద ఎత్తున వ్యూయర్ షిప్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ చిత్రానికి సుభాష్ రాజ్ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ (AGS Entertainment) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమాలో జాన్ కొక్కెన్, వివేక్ ప్రసన్న వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు మరో అతిపెద్ద బలం ఏంటంటే.. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM). ఆయన అందించిన అదిరిపోయే సంగీతం సినిమాలోని యాక్షన్ సీన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లి, ప్రేక్షకులకు ఒక మైండ్ బ్లోయింగ్ థ్రిల్‌ను ఇస్తుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఈ వారాంతంలో నెట్‌ఫ్లిక్స్‌లో 'బ్లాస్ట్ జోన్' చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

PolitEnt Media

PolitEnt Media

Next Story