జోడీ రిపీట్

Actor Akkineni Nagarjuna: టాలీవుడ్ లో 4 దశాబ్దాలుగా తనదైన స్టైల్, ప్రయోగాత్మక సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇప్పటికీ అదే క్రేజ్ తో ముందుకెళ్తున్నాడు. కొమాంటిక్ హీరోగా మొదలై. యాక్షన్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ పాటు ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. వయసు సంఖ్య మాత్రమేనని, నటనకు హద్దులుండనని ప్రతి చిత్రంతో నిరూపిస్తూనే ఉన్న ఈ టాలీవుడ్ మన్మథుడు. ప్రస్తుతం తన 100వ మూవీని ఎంతో ప్రత్యే కంగా ప్లాన్ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'కింగ్ 100' లేదా 'లాటరీ కింగ్' అనే టైటిల్ను పరిశీలిస్తున్నాడు.

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇందులో నాగ్ సరసన ఎవరూ ఊహించని విధంగా సీనియర్ నటి టబు కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు సిసీ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. 'నిన్నే పెళ్లాడుతా', 'ఆవిడ మా అవిడే' వంటి సినిమాలతో ఈ జోడీ వెండిత రపై మ్యాజిక్ చేసింది. కార్తీక్ ఆమె కోసం ఒక పవర్ఫుల్ అండ్ కీ రోలు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దాదాపు 27 ఏండ్ల తర్వాత మళ్లీ వీరు కలిసి నటించబోతున్నారన్న వార్త వినగానే అక్కినేని ఫాన్స్ కుషీ అవుతున్నారు..

PolitEnt Media

PolitEnt Media

Next Story