Actor Anil Kapoor: ఆ చాన్స్ మిస్ చేసుకున్నందుకు బాధగా ఉంది
బాధగా ఉంది

Actor Anil Kapoor: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులుఅత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రి ల్లర్ ధురంధర్ 2. ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 19న వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. దురంధర్ సినిమాలో ఒక కీలకమైన అతిథి పాత్రలో నటించే అవకాశం తన వద్దకు వచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల దానిని వదులుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. దర్శకుడు ఆదిత్యధర్ ఈ పాత్ర కోసం అనిల్ కపూర్ను సంప్రదించినప్పుడు, ఆయన కూడా నటించడానికి ఎంతో ఉత్సాహం చూపారట. కానీ, అదే సమయానికి మరో దర్శకుడికి ఇచ్చిన డేట్స్ అడ్డురావడంతో ధురంధర్ 2 నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకరికి ఇచ్చిన మాటను తప్పి, డేట్స్ను క్యాన్సి ల్ చేసి మరో సినిమాను అంగీకరించడం సరైనపద్ధతి కాదు. అద్భుతమైన అవకాశం కోల్పోవ డం బాధాకరమే అయినా, వృత్తి పట్ల నిబద్ధత అంతకంటే ముఖ్యం కదా అని అనిల్ కపూర్ చెప్పుకొచ్చాడు.

