Actor Arjun Sarja: స్టార్ హీరోఇంట పెళ్లి సందడి: ఈ నెల 18న చిన్న కుమార్తె వివాహం..
వివాహం..

Actor Arjun Sarja: సినీ దిగ్గజం అర్జున్ సర్జా కుటుంబంలో మరో శుభకార్యానికి రంగం సిద్ధమైంది. ఆయన చిన్న కుమార్తె అంజనా సర్జా ఈ నెల 18న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ ప్రేమాయణం అనంతరం, తన ప్రియుడు ఇసాయ్‌తో కలిసి ఆమె ఏడడుగులు వేయబోతున్నారు. ఇరు కుటుంబాల పెద్దల ఆశీస్సులతో ఈ వివాహం ఘనంగా జరగనుంది.
ఇటలీలోని ప్రసిద్ధ లేక్ కోమో తీరంలో వీరి నిశ్చితార్థం గతంలోనే వేడుకగా జరగ్గా, పెళ్లి వేడుకను మాత్రం అత్యంత సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించారు.
అంజన, ఇసాయ్ గత పదమూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల సమ్మతితో ఇప్పుడు దంపతులు కాబోతున్నారు. నటనవైపు వెళ్లిన పెద్దమ్మాయి ఐశ్వర్యలా కాకుండా, అంజన వ్యాపార రంగాన్ని ఎంచుకున్నారు. విదేశాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన ఆమె, పండ్లు, మొక్కల ఆధారిత వ్యర్థాలతో పర్యావరణ అనుకూల హ్యాండ్‌బ్యాగ్‌లను తయారు చేసే సర్జా సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు. ఇటీవల పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహం ప్రముఖ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో ఘనంగా జరగ్గా, ఇప్పుడు చిన్న కుమార్తె పెళ్లితో సర్జా ఇంట వరుస వేడుకల సందడి నెలకొంది.

