Actor Mohanlal: మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ను ఏనుగు దంతాల వివాదం మరోసారి చుట్టుముట్టింది. వన్యప్రాణుల చట్టాల ఉల్లంఘన కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న ఆయనకు సంబంధించిన కేసులో.. తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. మోహన్‌లాల్ వద్ద ఉన్న ఏనుగు దంతాల విగ్రహాలకు అటవీ శాఖ అధికారులు ఇప్పుడు డీఎన్ఏ (DNA) పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

గతంలో తన వద్ద నాలుగు ఏనుగు దంతాలు మాత్రమే ఉన్నాయని ప్రకటించిన మోహన్‌లాల్.. కేరళ అటవీ శాఖ తీసుకొచ్చిన క్షమాభిక్ష పథకంలో భాగంగా తాజాగా మరో ఆరు దంతాలు, అలాగే ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు కూడా తన వద్ద ఉన్నట్లు వెల్లడించారు.అయితే, తన వద్ద ఉన్న ఈ దంతాలు, విగ్రహాలలో చాలా వరకు తనకు వారసత్వంగా వచ్చినవని.. మరికొన్ని బహుమతులుగా లభించినవేనని మోహన్‌లాల్ స్పష్టం చేశారు.

అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. మోహన్‌లాల్ ప్రకటించిన ఈ విగ్రహాలలో కృష్ణుడు, రాముడు, బాలాజీ రూపాలు ఉన్నాయి. వీటి మొత్తం బరువు సుమారు 46 కిలోల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. మరి ఈ డీఎన్ఏ పరీక్షల్లో ఎలాంటి నిజాలు బయటపడతాయో, ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story