నవీన్ పొలిశెట్టి కండీషన్స్ ..

Actor Naveen Polishetty: చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లో అడుగుపెట్టిన నవీన్ పోలిశెట్టి. క్రమంగా తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతి రత్నాలు చిత్రంతో స్టార్డమ్ అందుకున్న ఆయన తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన అనగనగా ఒక రాజు మూవీతో మరోసారి తన రేంజ్ ఏంటో ప్రూప్ చేశాడు. ఈ సినిమా థియేటర్లలో మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో కి చేరి సంక్రాంతి రేసులో అసలైన విజేతగా నిలిచింది.

సంక్రాంతి హిట్ తో ఆయన మార్కెట్ ఒక్కసారిగా పెరగడంతో బడా నిర్మాతలు సైతం నవీన్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని టాక్. అయితే తన దగ్గరకు వచ్చే ప్రతి నిర్మాతకు రెండు స్పష్టమైన షరతులు పెట్టి వాటికి ఓకే అయితేనే సినిమా చేస్తానని చెప్పినట్లు సమాచారం. వాటిలో మొదటిది పారితోషికానికి సంబంధించినది. తదుపరి సినిమా నుంచి రూ.15 కోట్లు రెమ్యూనరే షన్ కావాలని డిమాండ్ చేస్తున్నాడట. ఇక రెండోది. సినిమా మొత్తంపై పూర్తి కంట్రోల్ తనదేనని.. నిర్మాత జోక్యం ఉండకూడదని కోరుతున్నాడట. ఇదే విషయం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story