ఆయన నాకు దేవుడితో సమానం..

Actor Ponnambalam: వందలాది సినిమాల్లో నటించి తెలుగు,తమిళ్,మలాయాళం,కన్నడ లో పేరు తెచ్చుకున్న నటుడు పొన్నాంబళం. స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్,చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున, పవన్ కల్యాణ్, విజయ్, అజిత్,శరత్‌కుమార్, మోహన్ లాల్, సురేష్ గోపి, మమ్ముట్టి వంటి స్టార్ హీరోల చిత్రాలలో పొన్నాంబళం కీలక పాత్రలు పోషించారు.

లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పొన్నాంబళం తన పర్సనల్ లైఫ్, ఆరోగ్య పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో 2021తాను డయాలసిస్ చేయించుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనకు సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారని.. పొన్నాంబళం పలు ఇంటర్వ్యూలలో చిరంజీవి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.

పొన్నాంబళం మాట్లాడుతూ.. నేను కిడ్నీ సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నా... వైద్య ఖర్చుల కోసం ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయి.. ఈ కష్ట సమయంలో నా స్నేహితుడి ద్వారా చిరంజీవి నంబర్ తీసుకుని మెసేజ్ చేశా. చిరంజీవి వెంటనే స్పందించి హైదరాబాద్ రమ్మని అడిగారు. పొన్నాంబళం రాలేకపోతున్నానని చెప్పడంతో చిరంజీవి చెన్నైలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ కావాలని సూచించారు.

అనంతరం చిరంజీవి సాయంతో పొన్నాంబళం అపోలో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను . ఆసుపత్రి అడ్మిషన్ ఫీజు కూడా లేకుండా వైద్యం చేశారు. నా చికిత్స కోసం రూ. 40 లక్షల వరకు ఖర్చు అయింది, మొత్తం ఖర్చును చిరంజీవి భరించారు. తాను కేవలం చిరంజీవి నుంచి రెండు మూడు లక్షల సాయం మాత్రమే ఆశించానని, కానీ చిరంజీవి ఇప్పటివరకు రూ. కోటి వరకు సాయం చేశారని ఎమోషనల్ అయ్యారు. చిరంజీవిని దేవుడితో పోల్చారు పొన్నాంబళం.

PolitEnt Media

PolitEnt Media

Next Story