Actor Prabhas: జపాన్ కు రావడం నా కల..మీ ప్రేమకు ఫిదా
మీ ప్రేమకు ఫిదా

Actor Prabhas: నటుడు ప్రభాస్ జపాన్‌లో జరిగిన 'బాహుబలి: ది ఎపిక్' ప్రత్యేక స్క్రీనింగ్ , ప్రమోషన్ కార్యక్రమానికి హాజరై జపనీస్ అభిమానులతో ముచ్చటించారు. అక్కడ ప్రభాస్ తన ప్రసంగంలో జపాన్ అభిమానుల పట్ల తనకున్న ప్రేమను , కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
"మీ ప్రేమకు ధన్యవాదాలు.బాహుబలి' తర్వాత, రాజమౌళి , శోభు ,లక్ష్మి గారు (శోభు గారి భార్య) మీ అందరి గురించి చాలా బాగా మాట్లాడారు. "గత పదేళ్లుగా నేను జపాన్ గురించి చాలా వింటున్నాను. చివరికి, నేను మీ అందరినీ చూస్తున్నాను. ధన్యవాదాలు. జపాన్‌కు రావడం నా కల. ఇది నెరవేరింది."లక్ష్మి లాగే, నేను కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలని ఆశిస్తున్నాను. లవ్ యూ! అని అన్నారు ప్రభాస్
అభిమానుల కోరిక మేరకు ప్రభాస్ 'బాహుబలి' సినిమాలోని తన ఫేమస్ డైలాగ్‌ను జపనీస్ భాషలో చెప్పడానికి ప్రయత్నించారు, ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ పర్యటనలో ప్రభాస్ నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి పాల్గొన్నారు. గతంలో కాలి గాయం కారణంగా 'కల్కి 2898 AD' విడుదల సమయంలో జపాన్ పర్యటనను రద్దు చేసుకున్న ప్రభాస్, ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు అభిమానులను కలుసుకున్నారు.
ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజి, స్పిరిట్ సినిమాల షూటింగ్స్‌తో ప్రభాస్ బిజీగా ఉన్నారు. సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం, కల్కి 2898 ఏడీ పార్ట్ 2 సినిమాలు చేయాల్సి ఉంది.

