సీఐడీ విచారణకు ప్రకాశ్ రాజ్

Betting App Case: నటుడు ప్రకాశ్ రాజ్ ఈ రోజుసీఐడీ విచారణకు హాజరు కానున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో భాగంగా తెలంగాణ సీఐడీ (CID - Crime Investigation Department) అధికారులు ఆయనకు సమన్లు జారీ చేశారు. నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన కేసులో సీఐడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు చేస్తోంది. ఈ ప్రమోషన్ల కోసం నటులు తీసుకున్న పారితోషికాలు ,కమిషన్లపై అధికారులు విచారణ జరుపుతారు.

నిన్న నవంబర్ 11న మధ్యాహ్నం ఇదే కేసులో నటుడు విజయ్ దేవరకొండ కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు.అధికారులు ఆయనను సుమారు గంట నుంచి గంటన్నర పాటు ప్రశ్నించారు.నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కోసం ఆయన తీసుకున్న పారితోషికం (Remuneration), అందుకు సంబంధించిన అగ్రిమెంట్ల వివరాలపై అధికారులు ఆరా తీశారు.

తాను ప్రమోట్ చేసిన యాప్ 'A23' అనేది స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ అని, ఇది బెట్టింగ్ యాప్ కాదని విజయ్ దేవర కొండ అధికారులకు తెలిపారు.తాను ప్రచారం చేసిన యాప్ చట్టబద్ధంగా అనుమతి ఉన్న ప్రాంతాలలో మాత్రమే ఓపెన్ అవుతుందని, తెలంగాణ వంటి నిషేధిత ప్రాంతాలలో ఓపెన్ అవ్వదని పేర్కొన్నారు.ఇకపై ఈ తరహా యాప్స్ ప్రమోషన్లను రిపీట్ చేయనని కూడా ఆయన అధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం.ఆయన ఆ యాప్ కంపెనీతో చేసుకున్న అగ్రిమెంట్ పత్రాలను సీఐడీకి అందించారు. ఇదే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ మనీలాండరింగ్ కేసులో ప్రకాశ్ రాజ్ గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు కూడా హాజరయ్యారు. ఇవాళ మరోసారి విచారణకు హాజరుకానున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story