మరో మెగా హీరో

Actor Sai Durgha Tej: సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej) తన పెళ్లి గురించి స్పష్టమైన ప్రకటన చేశారు. నవంబర్ 17న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన వివాహం వచ్చే ఏడాది 2026లో జరుగుతుందని ప్రకటించారు. ఎన్నో రోజులుగా తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు, పుకార్లకు చెక్ పెట్టాడు.మంచి చిత్రాలు, మంచి జీవితాన్ని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడానికి తిరుమల వచ్చానని ఆయన తెలిపారు.గతంలో, మీడియాలో వచ్చిన కథనాల వల్లే తన ప్రేమ విఫలమైందని (బ్రేకప్ అయిందని) కూడా ఆయన ఒక సందర్భంలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్టు స్వయంగా ప్రకటించారు. అయితే వధువు ఎవరు అనే దానిపై మాత్రం ఆయన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు."నా పెళ్లి వచ్చే ఏడాదిలో జరుగుతుంది. నాకు మంచి సినిమాలు, మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమల వచ్చాను," అని సాయి దుర్గ తేజ్ పేర్కొన్నారు.

అలాగే ఆయన నటిస్తున్న తదుపరి చిత్రం 'సంబరాల ఏటి గట్టు' కూడా వచ్చే ఏడాది 2026 లోనే విడుదల కానుందని తెలిపారు.రోహిత్ కె.పి. దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ‘SDT18’ కాగా, దీనికి ‘SYG’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, ‘సంబరాల ఏటిగట్టు’ అనే క్యాప్షన్‌గా పెట్టారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story