32 కిలోమీటర్ల రన్నింగ్, యోగా

Actor Sharwanand: సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు.. ఆ రంగుల వెనుక ఎంతో కష్టం, మరెంతో అంకితభావం ఉంటుంది. దానికి నిలువెత్తు నిదర్శనం శర్వానంద్! తన కొత్త చిత్రం ‘బైకర్’ కోసం శర్వానంద్ చేసిన మేకోవర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక అథ్లెటిక్ బైకర్ పాత్రలో ఒదిగిపోవడానికి ఆయన గడిచిన రెండేళ్లుగా ఒక తపస్సులా తన దినచర్యను మార్చుకున్నారు.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! ఈ చిత్రంలోని క్యారెక్టర్ డిమాండ్ మేరకు శర్వానంద్ ఒకానొక సమయంలో రోజుకు ఏకంగా 32 కిలోమీటర్ల మేర రన్నింగ్ , వాకింగ్ చేసేవారు. కేవలం ఫిజికల్ ట్రైనింగ్ మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కోసం, ఏకాగ్రత కోసం యోగా,ప్రాణాయామం కూడా ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో ఆయన సుమారు 7 కిలోల బరువు తగ్గారు. కానీ, ఒక బైకర్ బాడీ లాంగ్వేజ్ పై మరింత అవగాహన పెంచుకున్నాక, పాత్రకు తగ్గట్టుగా ఇంకాస్త బరువు తగ్గి పూర్తి మేకోవర్ తో సిద్ధమయ్యారు.

రెండేళ్ల పాటు ఒకే పాత్ర కోసం ఇంతలా శ్రమించడం అంటే మామూలు విషయం కాదు. "బైకర్ అంటే కేవలం బైక్ నడపడం కాదు.. ఆ బైక్ కి, రైడర్ కి మధ్య ఉండే ఒక ఎమోషనల్ బాండ్" అని నమ్మిన శర్వానంద్, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. తన ఆహారపు అలవాట్లను మార్చుకొని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకొని ఒక పర్ఫెక్ట్ స్పోర్ట్స్ మ్యాన్ లా తయారయ్యారు. శర్వానంద్ కెరీర్ లోనే ఇది అత్యంత ఛాలెంజింగ్ రోల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరి శర్వానంద్ పడ్డ ఈ రెండేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. ఈ భారీ యాక్షన్ డ్రామా ‘బైకర్’ ఏప్రిల్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరి శర్వానంద్ ఈ కొత్త అవతారంలో ఎలా మెప్పించబోతున్నారో చూడాలంటే ఏప్రిల్ 3 వరకు వేచి చూడాల్సిందే.

PolitEnt Media

PolitEnt Media

Next Story