విచారణకు హాజరైన నటుడు శివాజీ

Actor Sivaji : సికింద్రాబాద్ మహిళా కమిషన్ ముందు సినీ నటుడు శివాజీ హాజరయ్యారు.'దండోరా' సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్లు, మహిళల వస్త్రాధరణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేయడంతో, ఆయన కమిషన్ ముందు హాజరయ్యారు. సికింద్రాబాద్ లోని బుద్ధ భవన్ లో మహిళా కమిషన్ కార్యాలయానికి హాజరై వివరణ ఇచ్చారు.

దండోరా' చిత్ర వేడుకలో శివాజీ మాట్లాడుతూ.. "హీరోయిన్లు లేదా అమ్మాయిలు వేసుకునే పొట్టి బట్టల వల్లే అబ్బాయిలు పక్కదారి పడుతున్నారు" అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని, బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని పలు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. శివాజీ కామెంట్స్ సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. కొందరు శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతుంటే..మరికొందరు ఆయన వ్యాఖ్యల్లో తప్పేముందని కామెంట్ చేస్తున్నారు.

శివాజీ తాను చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే తాను బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని ఆయన ప్రకటించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story