నేనే షాకయ్యా..

Actor Tanikella Bharani: తెలుగు సినీ ప్రపంచంలో సీనియర్ నటుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ల భరణికి ప్రత్యేక గౌరవం ఉంది. కొన్ని దశాబ్దాలుగా వెండి తెరపై తన నటనతో, మాటలతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకు న్నాడు. ఆయన కలం నుంచి జాలువారే కవిత్వమైనా, పలికే సంభాషణలైనా సమాజంపై ఎంతో ప్రభావం చూపుతాయి. అలాంటి వ్యక్తిత్వాన్ని కూడా వదల కుండా, కేవలం కొన్ని ప్యూస్ కోసం, క్లిక్ బైట్ థంబ్ నెయిల్స్ కోసం కొందరు చేస్తున్న ఆసత్య ప్రచారాలపై తనదైన శైలిలో స్పందించాడు. సోషల్ మీడియా హద్దులు దాటుతోందా? నా అస్తులు చూసి అందరూ షాక్ అవ్వాల్సిందే అని రాశారు, కానీ వార్తలు చూసి నేనే షాకయ్యాను. నా ఇంటి ముందు అరడజన్ కార్లు కూడా ఉన్నాయని చూపించాడు. అదంతా చూసి మేము నవ్వు కున్నం. ఇప్పుడు ఒకదేశంపై యుద్ధం జరుగుతోంది.. నేను ఒక దేశానికి సపోర్ట్ చేస్తున్నట్లు. ఒక వర్గానికి మద్దతుగా చేస్తున్నట్లు ఇష్టమొచ్చినట్లు పెట్టే స్తున్నరు. నేను అన్ని వర్గాలు, మతాలను గౌరవిస్త, ఎవరికీ వ్యతిరేకం కాదు. నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదు. భవిష్యత్తులో చేయను. ఇవీ చూసి నా మిత్రులు, శ్రేయోభిలాషులు బాధపడి ఉంటారు. దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు స్పందించవద్దు' అని తనికెళ్ల భరణి రిక్వస్ట్ చేశాడు.

