టీవీకేకు విజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుర్తు

Actor Vijay's Tamilaga Vetri Kazhagam (TVK) party: నటుడు విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్నికల గుర్తును కేటాయించింది. అలాగే, కమల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం) పార్టీకి కూడా గుర్తును అలాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. టీవీకేకు ‘విజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’, ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంకు ‘బ్యాటరీ టార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ గుర్తును కేటాయించింది. ఈ ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీల నాయకులు ఈ గుర్తులపై పోటీ చేయనున్నారు. ఆ రెండు పార్టీలకు కేటాయించిన గుర్తులు అసెంబ్లీ లేదా లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మాత్రమే వర్తిస్తాయని, ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యాక ఆ పార్టీలు ఈ గుర్తులను ఉపయోగించడానికి అనుమతి లేదని ఈసీ స్పష్టం చేసింది. కాగా, విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిపాదించిన 10 గుర్తుల్లో ‘విజిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ గుర్తు తమ తొలి ప్రాధాన్యత అని, ఆ గుర్తునే ఈసీ కేటాయించిందని పార్టీ నేత సీటీఆర్ నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. కోరుకున్న గుర్తే వచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story