ఎవరా మిస్టరీ బాయ్ ఫ్రెండ్?

Actress Faria Abdullah: జాతి రత్నాలు సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను ప్రేమలో ఉన్నట్లు ఆమె అధికారికంగా తెలిపారు. ఇంటర్వ్యూ సందర్భంగా "మీరు ప్రేమలో ఉన్నారా?" అని అడిగిన ప్రశ్నకు ఫరియా కాస్త సిగ్గుపడుతూ, చిరునవ్వుతో "అవును" అని సమాధానం ఇచ్చారు. ప్రేమలో ఉండటం వల్ల తన బిజీ లైఫ్ ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే తన ప్రియుడి పేరును కానీ, ముఖాన్ని కానీ ఆమె బయటపెట్టలేదు.

తన ప్రియుడి గురించి ఫరియా కొన్ని ఆసక్తికరమైన హింట్స్ ఇచ్చారు. ఆయన ఆర్ట్, డ్యాన్స్ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి అని తెలిపారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ముస్లిం అని అడగగా, ఫరియా నవ్వుతూ ఆయన హిందూ అని స్పష్టం చేశారు. క్రియేటివ్ రంగానికి చెందిన వ్యక్తి కావడంతో, ఆయన కొరియోగ్రాఫరా? థియేటర్ ఆర్టిస్టా? లేక చిత్రకారుడా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.

సినిమాల్లోకి రాకముందే ఫరియా 'హైదరాబాద్ డైరీస్' అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయ్యారు. 'జాతి రత్నాలు' సినిమాతో బ్లాక్ బస్టర్ డెబ్యూ అందుకున్న ఆమె, ఆ తర్వాత 'లైక్ షేర్ సబ్‌స్క్రైబ్', 'రావణాసుర', 'ఆ ఒక్కటీ అడక్కు', 'మత్తు వదలరా 2' వంటి సినిమాలతో మెప్పించారు. పాన్ ఇండియా చిత్రం 'కల్కి 2898 AD'లోనూ ఆమె ఒక చిన్న పాత్రలో కనిపించి అలరించారు.

ప్రస్తుతం ఫరియా 'గుర్రం పాపిరెడ్డి'తో పాటు తన తమిళ అరంగేట్రం 'వల్లి మయిల్' వంటి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కెరీర్ పరంగా దూసుకుపోతూనే, తన ప్రేమ విషయాన్ని ధైర్యంగా చెప్పిన ఈ 'చిట్టి'పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story