నటికి నోటీసులు

Actress Khushi Mukherjee: టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి ఖుషీ ముఖర్జీ చిక్కుల్లో పడ్డారు. సూర్యకుమార్ గతంలో తనకు పదేపదే మెసేజ్‌లు పంపేవాడని ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యల వల్ల భారత క్రికెట్ స్టార్ పరువుకు భంగం కలిగిందంటూ ముంబైకి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ ఆమెపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

ఖుషీ ముఖర్జీ కేవలం పబ్లిసిటీ కోసమే అంతర్జాతీయ క్రికెటర్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఫైజాన్ అన్సారీ ఆరోపించారు. జనవరి 13న ఘాజీపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని, కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడేలా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది అభిమానించే ఆటగాడి గురించి ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయడం నేరమని ఆయన పేర్కొన్నారు.

ఒక ఈవెంట్‌లో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఖుషీ ముఖర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను ఏ క్రికెటర్‌తోనూ డేటింగ్ చేయాలనుకోవడం లేదు, కానీ చాలా మంది క్రికెటర్లు నాపై ఆసక్తి చూపిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ గతంలో నాకు చాలా మెసేజ్‌లు చేసేవాడు. ఇప్పుడు మేము మాట్లాడుకోవడం లేదు, అతని పేరుతో నన్ను ముడిపెట్టడం నాకు ఇష్టం లేదు" అని ఆమె అనడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వివాదం ముదిరి చట్టపరమైన ఇబ్బందులు ఎదురవడంతో ఖుషీ ముఖర్జీ స్వరం మార్చారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయ్యిందని వింత వాదనలు చేశారు. సూర్యకుమార్ కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే గతంలో పలకరించేవాడని, అది కూడా ఒక మ్యాచ్ ఓడిపోయిన సమయంలో జరిగిన స్నేహపూర్వక సంభాషణ మాత్రమేనని స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, ప్రస్తుతం తామిద్దరం టచ్‌లో లేమని చెబుతూ భారత జట్టుకు, కెప్టెన్ సూర్యకుమార్‌కు రాబోయే ప్రపంచకప్ కోసం శుభాకాంక్షలు తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story