ఆడపులిలా ఫీలవుతున్నా

Actress Kiara Advani: వెండితెరపై తన అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచుకున్న కియరా అద్వానీ.. ఇప్పుడు ఒక కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. అదే "మదర్ హుడ్". తల్లి కావడం అనేది ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తల్లి అయ్యాక నేను ఒక ఆడపులిలా మారానని అనిపిస్తోంది(I have become a tigress) అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఒక వైపు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఉన్న బంధం .. మరోవైపు బిడ్డ బాధ్యతలు.. వీటి మధ్య కియరా తన కెరీర్‌ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. "నేను ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉంటున్నాను, నా సమయాన్ని ఎలా కేటాయించాలో నాకు బాగా తెలుసు. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనిపిస్తే.. మరికొన్ని చిన్న విషయాలు కూడా చాలా ముఖ్యంగా అనిపిస్తున్నాయన్నారు.
కియారా త్వరలోనే టాక్సిక్ సినిమాతో వెండితెరపై రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో నాడియా పాత్రలో కనిపించనున్న ఆమెతో పాటు నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

