ప్రేమకు కూడా ఇన్సూరెన్స్

Actress Kriti Shetty: ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి నుంచి మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ వస్తోంది! ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృతి శెట్టి పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

ఈ సినిమా గురించి కృతి చెబుతూ.. ‘ఉప్పెన’ తర్వాత తాను చేసిన ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ ఇదేనని, ఇది అందరికీ రిలేట్ అయ్యే కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని పేర్కొంది. ముఖ్యంగా 2040 నాటి ఫ్యూచరిస్టిక్ ఐడియాతో ఈ కథ సాగుతుంది. "ప్రస్తుతం బాడీ పార్ట్స్‌కు ఇన్సూరెన్స్ చేస్తున్నట్టే.. ఫ్యూచర్‌లో ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉంటే ఎలా ఉంటుంది?" అనే పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అంటోంది కృతి.ఈ సినిమాలో కృతి ఒక వెరైటీ క్యారెక్టర్ చేసింది. "ఈ కాలం జనరేషన్‌కు డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ, ఫోన్ లేకపోతే ఉండలేరు" అన్నట్టుగా సాగే తన పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. సోషల్ మీడియా లైక్స్, షేర్స్ చుట్టూ తిరిగే నేటి ప్రపంచాన్ని ఈ సినిమాలో చాలా రియలిస్టిక్‌గా, సినిమాటిక్‌గా చూపించబోతున్నారు.

హీరో ప్రదీప్ రంగనాథన్ జడ్జ్‌మెంట్ పవర్ సూపర్ అని.. అతని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని కృతి తెలిపింది. ఇక నయనతార నిర్మాణంలో నటించడంపై స్పందిస్తూ.. "నయనతార గారు బయట చాలా స్వీట్ పర్సన్. కెరీర్ విషయంలో ఆమె నాకు కొన్ని కీలకమైన టిప్స్ కూడా ఇచ్చారు" అని చెప్పుకొచ్చింది. అలాగే ఎస్‌జే సూర్య గారితో పనిచేయడం గొప్ప ఎక్స్‌పీరియన్స్ అని వెల్లడించింది.ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాతో పాటు, తమిళంలో మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని స్పష్టం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story