నో చెప్పలేక బాధపడ్డాను

Actress Meena: నటి మీనా బాలీవుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) చిత్రాలలో చాలా బిజీగా ఉన్న కారణంగా బాలీవుడ్ నుండి వచ్చిన అనేక ఆఫర్లను తిరస్కరించానని తెలిపారు. ఆ సమయంలో ఆమెకు తినడానికి, నిద్రపోవడానికి కూడా సరిగా సమయం ఉండేది కాదట. బాలీవుడ్ సినిమాలు చేస్తే, మరింత సమయం కేటాయించాల్సి వస్తుందని భావించేవారని చెప్పారు.

హిందీలో ఒక్క సినిమా చేసే సమయానికి, దక్షిణాదిలో నాలుగు సినిమాలు చేయొచ్చని అప్పట్లో ఆమెకు చెప్పేవారట. అందుకే బాలీవుడ్‌పై ఎక్కువ దృష్టి పెట్టలేదని తెలిపారు.

బాలీవుడ్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనకు ఒకప్పుడు సినిమా చేయమని పదేపదే అడిగేవారని మీనా తెలిపారు.ఊటీలో మిథున్ చక్రవర్తికి ఒక హోటల్ ఉండేదని, షూటింగ్‌ల కోసం అక్కడికి వెళ్లినప్పుడు, ఆయన తన గది దగ్గరకు వచ్చి "నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్?" అని అడిగేవారట.ఆయనకు నో చెప్పలేక ఒక దశలో ఆ హోటల్‌కి వెళ్లాలంటేనే భయపడేదాన్ని ..కానీ తర్వాత చాలా బాధపడ్డా అని ఆమె పాత సంఘటనను గుర్తు చేసుకున్నారు.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన్నే పెళ్లి చేసుకుంటానని తన అమ్మతో చెప్పానని మీనా వెల్లడించారు.అయితే హృతిక్ రోషన్ పెళ్లి చేసుకున్నప్పుడు తన గుండె పగిలిపోయిందని (Heartbreak) మీనా సరదాగా వ్యాఖ్యానించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story