Actress Mrunal Thakur: సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా నటి మృణాల్ ఠాకూర్ ఒక కామెడీ షోలో పాల్గొని, తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఒక వింత అనుభవాన్ని పంచుకున్నారు. అప్పట్లో ఆమె ఒక స్కాండినేవియన్ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు.

ఆ సమయంలో మృణాల్ హృతిక్ రోషన్‌తో కలిసి ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హృతిక్ లాంటి అందమైన హీరోలతో మృణాల్ షూటింగ్ చేస్తుండటం చూసి, ఆమె ప్రియుడు తీవ్రమైన ఇన్సెక్యూరిటీకి గురయ్యాడట. మృణాల్‌ను మెప్పించే క్రమంలో లేదా ఆ హీరోలతో పోటీ పడేందుకు అతను కష్టపడి వ్యాయామాలు చేసి సుమారు 15 నుండి 17 కిలోల బరువు తగ్గాడట.

అయితే, కొన్నాళ్ల తర్వాత అతను జిమ్‌కు వెళ్లడం మానేసి, తనకు అలసటగా ఉందని చెప్పాడట. "నువ్వు బరువు తగ్గాలని నేను ఎప్పుడూ కోరలేదు. కానీ అతను అందమైన హీరోలను చూసి భయపడి ఆ పని చేశాడు. అదంతా అతని ఇన్సెక్యూరిటీ వల్లే జరిగింది" అని మృణాల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మృణాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే, మృణాల్ నటించిన "దో దివానే సెహర్ మే" నేడు (ఫిబ్రవరి 20) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే ఈ వేసవిలో ఆమె నటించిన తెలుగు చిత్రం "డెకాయిట్" కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story