Actress Nidhi Agarwal: ఇండస్ట్రీలో నన్ను తొక్కేసేందుకు కుట్ర
తొక్కేసేందుకు కుట్ర

Actress Nidhi Agarwal: సినీ ఇండస్ట్రీలో తన అందం, నటనతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నిధి అగర్వాల్.. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ టాక్డ్ హీరోయిన్ గా మారింది. గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో 'హరిహర వీరమల్లు', ఈ సంక్రాంతికి ప్రభాస్ సరసన 'దిరాజా సాబ్' సినిమాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే తాజాగా తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్కు సంబంధించి ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. 'నాపై ఇండస్ట్రీలో కొందరు పనిగట్టుకుని నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నరు. నన్నుతొక్కేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేసి మరీ కుట్రలు చేస్తున్నరు. నటీనటులు చాలా సెన్సిటివ్, ఎమోషనల్, చిన్నపిల్లల మన స్తత్వంతో ఉంటారు. ఇలాంటివి జరిగితే వారి కుటుంబాలు కూడా ఎంతో బాధపడతాయి. మేం సమాధానం చెప్పాల్సింది మా తల్లిదండ్రులకు మాత్రమే. ఇలాంటి నెగిటివ్ క్యాంపెయిన్లు మంచిది కాదు. కాశీకి వెళ్లి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికంగా నాలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఎన్ని తప్పుడు ప్రచారాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతా' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిధి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

