టాలీవుడ్ హీరోయిన్

Actress Nivetha Pethuraj: సినీ నటి నివేదా పేతురాజ్ తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నివేదా పేతురాజ్ త్వరలో వ్యాపారవేత్త అయిన రాజ్ హిత్ ఇబ్రాన్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇప్పటి నుంచి తన లైఫ్ అంతా ప్రేమమయమే అంటూ క్యాప్షన్ తో ప్రియుడితో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.దీంతో పలువురు సోషల్ మీడియాలో నివేదకు విషెస్ చెబుతున్నారు.

నివేదా పేతురాజ్ తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆమె కుటుంబం దుబాయ్‌కి మారడంతో అక్కడే తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆమె నటిగా మారకముందు 2015లో "మిస్ ఇండియా యూఏఈ" టైటిల్‌ను గెలుచుకున్నారు.

2016లో విడుదలైన తమిళ సినిమాఒరు నాల్ కూతుతో ఆమె నటిగా అడుగుపెట్టారు. 2017లో శ్రీ విష్ణు హీరోగా వచ్చిన 'మెంటల్ మదిలో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, విరాట పర్వం, దాస్ కా ధమ్కీ వంటి తెలుగు చిత్రాల్ల నటించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story