Actress Nora Fatehi: స్పెషల్ బ్యూటీ లారెన్స్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ
లారెన్స్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ

Actress Nora Fatehi: బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్, డ్యాన్స్ నంబర్లతో బాగా పాపులర్ అయిన నటి నోరా ఫతేహి, ఇప్పుడు కోలీవుడ్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఆమె తమిళంలో తన మొదటి సినిమా గురించి స్వయంగా వెల్లడించారు.రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న హారర్-కామెడీ చిత్రం కాంచన 4'తో నోరా ఫతేహి కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించనున్నారు.
ఇందులో ఆమె హీరోయిన్‌గా కనిపించనున్నారు. 'కాంచన' సిరీస్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాతోనే కోలీవుడ్‌లోకి అడుగుపెట్టడం సరైన నిర్ణయం అని నోరా పేర్కొంది. తమిళ భాష తన కెరీర్‌లో అత్యంత కఠినమైన భాష అని నోరా తెలిపింది. అయినప్పటికీ, డబ్బింగ్ లేకుండా సహజంగా నటించేందుకు ప్రత్యేకంగా డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపింది.
నోరా ఇప్పటికే హిందీ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించారు. తెలుగులో 'టెంపర్', 'బాహుబలి', 'కిక్ 2' వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. 'కాంచన 4'తో తమిళంలో ఆమె కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
