Actress Pooja Hegde: ట్రావెలింగ్ అంటే ఎంతిష్టమో నటి పూజా హెగ్డే ఇప్పటికే చాలాసార్లు నిరూపించారు. షూటింగ్‌ల నుంచి కాస్త విరామం దొరికితే చాలు ఆమె బ్యాగ్ సర్దుకుని పర్యటనలకు బయలుదేరుతారు. గతేడాది అమెరికా పర్యటనను ఆస్వాదించిన ఆమె, ప్రస్తుతం యూరప్ టూర్‌లో సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌ నగరాన్ని చుట్టేస్తున్న పూజా హెగ్డే, అక్కడి అందమైన లొకేషన్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ పోస్టులు మరింత ప్రత్యేకంగా నిలవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. ఇటీవల కొత్తగా షార్ట్ హెయిర్‌కట్ చేయించుకుని సరికొత్త లుక్‌లోకి మారిన పూజా హెగ్డే, మేక్ ఓవర్ తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడం ఇదే తొలిసారి. బుడాపెస్ట్ వీధుల్లో విహరిస్తూ, నదీ తీరాన ప్రశాంతంగా గడుపుతూ, పుస్తకాల షాపులను సందర్శిస్తూ ఆ నగరం అందించే ప్రశాంతతను, తన హాలిడే మూడ్‌ను ఆమె పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, పూజా హెగ్డే సుదీర్ఘ విరామం తర్వాత “శ్రీ శ్రీ” సినిమాతో తిరిగి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో ఆమె దుల్కర్ సల్మాన్ సరసన కథానాయికగా నటిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story