43 మందిపై కేసు నమోదు

Actress Ramya Receives Threats: తనపై అసభ్యకరమైన పదాలు వాడినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ నటి రమ్య మహిళా కమిషన్, పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. నటి స్వయంగా కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తనపై దర్శన్ అభిమానులు అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రవర్తించారని ఫిర్యాదు చేసింది. రమ్య ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ప్రమోద గౌడ అనే వ్యక్తితో సహా 43 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సెంట్రల్ డివిజన్ సేన్ స్టేషన్‌లో కేసు నమోద కాగా ఐటీ చట్టం 67, 66 , బిఎన్‌ఎస్ 351(2), 351(3), 352, 75(1)(4), 79 కింద కేసు బుక్ చేశారు పోలీసులు. కర్ణాటక మహిళా కమిషన్ కూడా ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి రమ్యకు మద్దతుగా నిలిచి, అశ్లీల సందేశాలు పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. కాగా దర్శన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రమ్యను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు, బూతులు వాడుతున్నారని, ఆమెను అత్యాచారం చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారని రమ్య ఆరోపించారు. "రేణుకాస్వామికి బదులుగా నిన్నే హత్య చేసి ఉండాల్సింది" అంటూ కూడా కొందరు దర్శన్ అభిమానులు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటన కన్నడ సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story