నా జీవితంలో మర్చిపోలేని ఘట్టాలు ఇవే..!- రాణీ ముఖర్జీ

తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ, బాలీవుడ్‌లో 30 ఏళ్ల అద్భుతమైన కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా రాణీ ముఖర్జీ తన అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకున్నారు. తన గొంతును ఎలా నిలబెట్టుకోగలిగిందో, మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే వంటి సినిమాలు, కథ ప్రాధాన్యం – పురుష/మహిళ ఆధారిత సినిమాలుగా వర్గీకరించకుండా చూడాలన్న అభిప్రాయం, జాతీయ అవార్డు అందుకున్న భావోద్వేగాలు తదితర అంశాలపై ఆమె మాట్లాడారు.

రాణీ ముఖర్జీ 30 ఏళ్ల ప్రయాణం నిజంగా ఇన్ స్పిరేషన్. 'Kuch Kuch Hota Hai' వంటి రొమాంటిక్ చిత్రాల నుంచి Black, Mardaani, Hichki వంటి శక్తివంతమైన పాత్రల వరకు విభిన్నమైన పాత్రలు పోషించారు. తన కళపై అంకితభావం, సాహసోపేతమైన సినిమాల ఎంపికలు ఆమెకు విమర్శకుల ప్రశంసలు, అభిమానుల అపారమైన ప్రేమను తెచ్చిపెట్టాయి. Mardaani–3 చిత్రం 2026 జనవరి 30న థియేటర్లలో విడుదల కానుంది.

30 ఏళ్ల సినీ ప్రయాణం గురించి…

తన కెరీర్‌లో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె జ్ఞాపకాలను, జాతీయ అవార్డు అందుకున్న అనుభూతులను పంచుకున్నారు.

తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పిన సందర్భం

డిస్ట్రిబ్యూటర్లు తన గొంతుపై సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ, Kuch Kuch Hota Hai సినిమా సమయంలో దర్శకుడు కరణ్ జోహార్ తనకు స్వయంగా డబ్బింగ్ చేసే అవకాశం ఇచ్చిన విషయాన్ని రాణీ గుర్తుచేసుకున్నారు.

“Kuch Kuch Hota Hai ట్రైలర్ షూట్ సమయంలో తెల్లటి సల్వార్ కమీజ్ వేసుకుని ‘భూత్’ (దెయ్యం) లాగా కనిపిస్తున్నానేమో అనిపించింది. కానీ అసలు ముఖ్యమైన విషయం – కరణ్ నాపై నమ్మకం పెట్టి నా డైలాగ్స్ నేనే చెప్పమన్నాడు. ‘నాకు నీ గొంతు చాలా ఇష్టం’ అన్న మాటలు నన్ను ధైర్యంగా నిలబెట్టాయి. అది నాకు చాలా ఉపయోగపడింది. ఈ రోజు నా వాయిస్ నా ఐడెంటిటీ గా మారింది,” అన్నారు.

మహిళలకు ప్రేరణనిచ్చే, సవాళ్లతో కూడిన పాత్రల ఎంపికపై

“నన్ను సవాలు చేసే, మహిళలకు ప్రేరణనిచ్చే పాత్రలు చేయడమే నాకు ఇష్టం. హమ్ తుమ్, ఆలవిదా, సాథియా సినిమాల్లో నా పాత్రలు బలమైన, ఆధునిక మహిళలుగా నిలిచాయి. నేను ప్రతి పాత్రలో పూర్తిగా లీనమవుతాను. వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి నటిస్తాను.

తమ నిర్ణయాలు తామే తీసుకునే మహిళల పాత్రలు నాకు ఎంతో ఇష్టం. మారుతున్న భారతీయ మహిళను ప్రతిబింబించే పాత్రలు చేయడమే నా లక్ష్యం. ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళలకు, ప్రేరణనిచ్చే కథలతో ముందుకు వెళ్లాలనుకుంటున్నాను,” అన్నారు.

బ్లాక్ చిత్రంలో సంజయ్ లీలా భన్సాలీతో పని చేసిన అనుభవం

“ఆ అనుభవం నన్ను పూర్తిగా మార్చేసింది. ఆయన దర్శకత్వం, ప్రతి సన్నివేశానికి ఇచ్చే ప్రత్యేక శక్తి నన్ను నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రేరేపించింది. సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టమైనప్పటికీ ఎంతో విలువైన అనుభవం.

వికలాంగులతో కలిసి నేర్చుకోవడం ద్వారా వాళ్ల జీవితంలోని కష్టాలు మరింత అర్థమయ్యాయి. శారీరక వైకల్యం ఉన్న మహిళ పాత్ర నా కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి,” అన్నారు.

హిచ్కీలో టూరెట్ సిండ్రోమ్ పాత్ర గురించి

“టీచర్‌గా టూరెట్ సిండ్రోమ్ ఉన్న పాత్రను పోషించడం పూర్తిగా భిన్నమైన అనుభవం. ఆ పాత్రను రియాలిటీ గా చూపించేందుకు పూర్తిగా అంకితమయ్యాను. సమాజంలో అలాంటి వాళ్లను కొందరు ఎగతాళి చేస్తారు – ఆ బాధను నేను ఆ పాత్ర ద్వారా అనుభవించాను.

ఈ పాత్ర ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా దాటవచ్చని చూపించింది. ఇలాంటి పాత్రలు చేయడం ద్వారా సమాజంలో అవగాహన పెంచడమే నా లక్ష్యం,” అన్నారు.

జాతీయ అవార్డు రాకపోయినా అభిమానుల ప్రేమే ముఖ్యమంటూ

“బ్లాక్ లేదా హిచ్కీకి జాతీయ అవార్డు రాకపోయినా, ప్రేక్షకుల ప్రేమే నాకు అన్నీ. నా తల్లికి ఆ సినిమాలు ఎంత ఇష్టమో నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలను గర్వపడేలా చేయాలనుకున్నాను. ఈ రోజు తరతరాల అభిమానుల ప్రేమ దక్కుతోంది.

17 ఏళ్ల వయసులో మొదలై 47 ఏళ్ల వరకూ ప్రయాణం చేశాను. మంచి పాత్రలు చేయడమే నా లక్ష్యం. అభిమానుల నమ్మకమే నన్ను ముందుకు నడిపించింది,” అన్నారు.

మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వేకి జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా

“అవార్డులు మంచివే. కానీ నేను ఎప్పుడూ మెరుగుపడాలనే తపనతోనే పనిచేస్తాను. ఈ సినిమా నా అమ్మకు అంకితం. ఆ పాత్రను నా అమ్మ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించాను. బెంగాలీ నేపథ్యం, భాష అన్నీ అందులో కలిపాను.

డెబికా పాత్రలో నాకు అమ్మే కనిపించింది. ఆమె బలం, కుటుంబంపై ప్రేమ ఈ సినిమాలో ప్రతిబింబించాయి,” అన్నారు.

మర్దానీపై తన అభిమానం

“ఆ సినిమా నాపై గాఢమైన ప్రభావం చూపింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేరాన్ని ఆధారంగా తీసుకుని తీసిన కథ అది. ఆ కోపం, బాధ అన్నీ నా నటనలో పెట్టాను.

సన్నివేశాల్లో నటీనటులను కొట్టడం నాకు కష్టం అనిపించింది. కానీ దర్శకుడు ప్రదీప్ సర్కార్ నిజంగానే కొట్టాలని కోరారు. మహిళల భద్రతపై ఆ సినిమా కీలక చర్చలు తెచ్చింది. అమ్మాయిలకు ధైర్యం ఇవ్వాలన్నదే నా ఆశయం,” అన్నారు.

“హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా” అనే ముద్రపై స్పందన

“హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఉందని లేబుల్ వేయడం కంటే, కథపై దృష్టి పెట్టాలి. ముందే నిర్ణయిస్తే పాత్రల్లో ఇరుక్కుపోయే ఒత్తిడి ఉంది. కొత్త తరం దీనిని మార్చాలి.

కథ, పాత్రలు, ప్రభావమే ముఖ్యము. అలా ఆలోచిస్తేనే సినిమా రంగం మరింత గొప్పగా ఉంటుంది,” అని రాణీ ముఖర్జీ అన్నారు.

Lipika Varma

Lipika Varma

Next Story