Renu Desai రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి రేణు దేశాయ్
రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు స్పష్టతనిచ్చారు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండో పెళ్లి గురించి వస్తున్న చర్చలకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. రేణు దేశాయ్ కి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడి పేరు అకీర నందన్ కాగా కుమార్తె పేరు ఆద్య. గుజరాతీ కుటుంబానికి చెందిన రేణు దేశాయ్ కుటుంబం మహారాష్ట్రలో స్థిరపడింది. బద్రీ సినిమా నిర్మాణ సమయంలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరి సహజీవనం నేపథ్యంలో పెళ్లికి ముందే కుమారుడు పుట్టగా పెళ్లి తర్వాత కుమార్తె జన్మించింది.
రెండో పెళ్లిపై రేణు దేశాయ్ మాట్లాడుతూ..
రెండో పెళ్లి చేసుకోవడానికి తాను మానసికంగా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ, మరికొన్ని సంవత్సరాల పాటు వేచి చూడాలని నిర్ణయించుకున్నానని వివరణ ఇచ్చారు. తన జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను" అని తెలిపారు.
