ట్రోలర్లకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్

Actress Renu Desai: నటి రేణు దేశాయ్ ఇటీవల వీధి కుక్కల మరణాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఒక జంతు ప్రేమికురాలిగా ఆమె చేసిన పోలికలు, దానికి ప్రతిగా వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారాయి.

హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో రేణు దేశాయ్ వీధి కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. "దేశంలో కొందరు మగాళ్లు రేప్‌లు, హత్యలు చేస్తున్నారు కదా.. అలా అని మగాళ్లందరినీ చంపేస్తారా? అలాగే ఎక్కడో ఒక కుక్క కరిచిందని వీధి కుక్కలన్నింటినీ చంపేయడం ఎంతవరకు న్యాయం?" అని ఆమె ప్రశ్నించారు. ఏటా దోమకాటు వల్ల లక్షల మంది చనిపోతున్నారు, వాటిని ఏమనాలి? అని ఆమె నిలదీశారు. వీధి కుక్కల అంశంపై ఇటీవల వచ్చిన న్యాయస్థాన తీర్పులను కూడా ఆమె తప్పుబట్టారు.

ఈ వ్యాఖ్యల తర్వాత నెటిజన్లు ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగాఆమె వ్యక్తిగత జీవితాన్ని (మాజీ భర్త పవన్ కళ్యాణ్ ప్రస్తావనను) తీసుకువస్తూ "అందుకే నిన్ను పవన్ కళ్యాణ్ వదిలేశాడు.. నీకు తిక్క ఎక్కువ" వంటి నీచమైన కామెంట్స్ చేస్తున్నారని ఆమె ఎమోషనల్ అయ్యారు.నాకు తిక్క ఉంది.. నేను నా సొంత డబ్బులతో మూగజీవాల కోసం పోరాడుతున్నాను. ఇందులో నా స్వార్థం ఏముంది?" అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు.

ఈ వివాదం నడుస్తుండగానే, ఆమె ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. దీనిపై ఆమె స్పష్టతనిచ్చారు.నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు" అని తేల్చి చెప్పారు. ప్రెస్ మీట్‌లో ఒక రిపోర్టర్‌పై అరిచారన్న వార్తలపై స్పందిస్తూ.. "అతను నా మీద గట్టిగా అరిచాడు, అందుకే నేను తిరిగి అరిచాను. దానిని మీడియా అంతా నెగిటివ్‌గా చూపిస్తోంది అని క్లారిటీ ఇచ్చారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story