Actress Sai Pallavi: మణిరత్నం దర్శకత్వంలో మెరవనున్న హైబ్రిడ్ పిల్ల
హైబ్రిడ్ పిల్ల

Actress Sai Pallavi: సాయి పల్లవి క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. సౌత్ నుంచి నార్త్ వరకు అందరూ ఆమె కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు. ఆమె నటనకు ఫిదా అయిన దిగ్గజ దర్శకుడు మణిరత్నం, తన నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
గతంలో ఒక పబ్లిక్ ఈవెంట్‌లోనే మణిరత్నం స్వయంగా "నేను సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్‌ని" అని స్టేజ్ మీద చెప్పారు. ఇప్పుడు ఆ అభిమానాన్ని సినిమాగా మార్చబోతున్నారు. ఒక రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
సాయి పల్లవి చేతిలో ఉన్న మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు:
రామాయణం (పార్ట్ 1 & 2): బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి సాయి పల్లవి ఇందులో సీతగా నటిస్తోంది. దీపావళికి విడుదల కానున్న ఈ సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఏక్ దిన్: ఆమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో కలిసి ఆమె నటిస్తున్న రెండో హిందీ సినిమా ఇది. ఈ సమ్మర్‌లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
కల్కి 2: ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 AD' సీక్వెల్‌లో సాయి పల్లవి నటించబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. మొదటి పార్ట్‌లో దీపికా పదుకోన్ పోషించిన సుమతి పాత్రను, రెండో పార్ట్‌లో సాయి పల్లవి చేయబోతున్నారట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ధనుష్‌తో (D55): రీసెంట్‌గానే ధనుష్‌తో కలిసి ఒక సినిమాను లాంచ్ చేసింది. ఇందులో శ్రీలీల కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది.

