సమంత సంచలన నిర్ణయం

Actress Samantha: నటి సమంత తన కెరీర్, ఆరోగ్యం, సోషల్ మీడియా గురించి గ్రాజియా ఇండియా మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సినిమాలు చేశామన్నది ముఖ్యం కాదు, మంచి సినిమాలు చేయడమే ముఖ్యం అని సమంత అన్నారు. గతంలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేశానని, కానీ ఇప్పుడు తన దృష్టి ఆరోగ్యం, ఫిట్‌నెస్, మంచి కంటెంట్‌పై ఉందని తెలిపారు.

ఆరోగ్యం సమస్యల వల్ల ఒకేసారి ఐదు సినిమాలు చేయనని స్పష్టం చేశారు. "నా శరీరం చెప్పే మాట వినాలని నిర్ణయించుకున్నాను" అని ఆమె తెలిపారు. ప్రాజెక్టుల సంఖ్య తగ్గినప్పటికీ, వాటి నాణ్యత కచ్చితంగా పెరుగుతుందన్నారు.

సోషల్ మీడియాలో వచ్చే ప్రశంసలతో పాటు విమర్శలు , ట్రోలింగ్‌ను కూడా స్వీకరించగలగాలని సమంత తెలిపారు. "ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్స్ మన జీవితాన్ని నియంత్రించకూడదు" అని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను అని చెప్పారు.

సమంత ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే సినిమాతో బిజీగా ఉన్నారు.గతంలో 'సిటడెల్, హనీ బన్నీ' వెబ్ సిరీస్‌లో నటించిన ఆమె, తాజాగా తన సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' ద్వారా నిర్మించిన 'శుభం' అనే చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story