ఫోక్ సాంగ్

Actress Srileela: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల పక్కన నటిస్తూనే మరో వైపు స్పెషల్ సాంగ్స్ చేస్తోంది శ్రీలీల. అటు సినిమాలు..స్పెషల్ సాంగ్స్ తో తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. పుష్ప 2లో కిస్సిక్ సాంగ్ తో దుమ్ము రేపిన శ్రీలీల ఇపుడు మరో స్పెషల్ ఫోక్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్‌ చేయనుందని టేటెస్ట్ టాక్. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న పెద్ది సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తోన్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్ర చేస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు నాసిక్‌లో కూడా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా 'ఫస్ట్ షాట్' గ్లింప్స్ మంచి హైప్ తెచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story