హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Actress Srinidhi Shetty: సాధారణంగా ఏ హీరోయిన్ అయినా తమ మొదటిమూడు సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటారు. ఆ అదృష్టం దక్కించుకున్న అతి కొద్దిమంది నటీమణులలో శ్రీనిధి శెట్టి ఒకరు. ఆమె తొలి చిత్రం కేజీఎఫ్ పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని అందుకోవడం ఆమె కెరీర్‌కు పునాది వేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కుటుంబ నేపథ్యం, సినీ ఆసక్తి

శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. "మా పేరెంట్స్‌కి మేము ముగ్గురం ఆడపిల్లలమే. నేను పదో తరగతిలో ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది.. అప్పటి నుంచి నాన్న ఎన్నో కష్టాలను భరిస్తూ మమ్మల్ని పెంచారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమాలంటే ఇష్టం. అదే నన్ను ఈ ఫీల్డ్‌కి వచ్చేలా చేసింది" అని తెలిపారు.

కేజీఎఫ్ సినిమా తర్వాత తాను ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకున్నారని ఆమె చెప్పారు.

క్రేజ్ వచ్చినా.. సింపుల్‌గా ఉండటమే ఇష్టం

కేజీఎఫ్ విజయం తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినా తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నట్లు శ్రీనిధి శెట్టి పేర్కొన్నారు.

"నాకు ఎంత క్రేజ్ వచ్చినా సింపుల్‌గా ఉండటమే నాకు ఇష్టం. అవసరమైతే క్యాబ్‌లో వెళతాను. సూపర్ మార్కెట్‌కి, షాపింగ్ మాల్స్‌కి నేను వెళుతూ ఉంటాను. రోడ్డుపక్కన పానీపూరీ కూడా తినేసి వస్తుంటాను. కాకపోతే అక్కడివాళ్లు గుర్తుపట్టేలోగా నేను బయటపడిపోతూ ఉంటాను" అని తన సాధారణ జీవనశైలిని వివరించారు.

శ్రీనిధి శెట్టి ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ జోడీగా నటించిన తెలుసు కదా సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story