Aditya Dhar Rejected Tamannaah: తమన్నాను రిజెక్ట్ చేసిన ఆదిత్య ధర్
రిజెక్ట్ చేసిన ఆదిత్య ధర్

Aditya Dhar Rejected Tamannaah: బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం కథాబలంతోనే కాకుండా తన అద్భుతమైన సంగీతంతో కూడా ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నటి అయేషా ఖాన్ ఆడిపాడిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ సెన్సేషన్‌గా మారింది.
చిత్రంలో అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజాతో కలిసి స్టెప్పులేసిన "శరారత్" అనే పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఈ పాట కోసం అయేషా ఖాన్ మొదటి ఎంపిక కాదన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తొలుత ఈ ప్రత్యేక గీతం కోసం చిత్ర బృందం, కొరియోగ్రాఫర్ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను తీసుకోవాలని భావించారు.
ఐటమ్ సాంగ్స్, స్పెషల్ నంబర్లలో తమన్నాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమెను ఎంపిక చేస్తే సినిమాకు అదనపు ఆకర్షణ లభిస్తుందని క్రియేటివ్ టీమ్ భావించింది. కానీ, దర్శకుడు ఆదిత్య ధర్ ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. తమన్నా ఇప్పటికే చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకులకు సుపరిచితం అయిపోయారని, ఈ పాట కోసం ఒక సరికొత్త ముఖం కావాలని ఆయన పట్టుబట్టారు.
తెలుగు చిత్రాలైన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి', 'ఓం భీమ్ బుష్' వంటి సినిమాల్లో అయేషా ఖాన్ చేసిన స్పెషల్ సాంగ్స్‌ను ఆదిత్య ధర్ గమనించారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ పట్ల ఆకర్షితుడైన దర్శకుడు, తమన్నా స్థానంలో అయేషాను ఖరారు చేశారు. దర్శకుడి నమ్మకాన్ని నిజం చేస్తూ అయేషా ఖాన్ తన గ్లామర్, డ్యాన్స్‌తో 'శరారత్' పాటను చార్ట్‌బస్టర్‌గా మార్చారు. అలా తమన్నాకు దక్కాల్సిన ఈ బంపర్ ఆఫర్ చివరకు అయేషా ఖాన్ ఖాతాలో చేరింది.

