Rajinikanth's Film: 36 ఏళ్ల తర్వాత.. రజినీ సినిమాకు A సర్టిఫికెట్
రజినీ సినిమాకు A సర్టిఫికెట్

Rajinikanth's Film: రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న 'కూలీ' సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'A' సర్టిఫికెట్ జారీ చేసింది.ఈ సినిమాకు A సర్టిఫికెట్ రావడానికి ప్రధాన కారణం ఇందులో హింసాత్మక సన్నివేశాలు (violence) ఎక్కువగా ఉండడమే. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో హింసను చాలా వాస్తవికంగా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా యాక్షన్, రక్తపాతం చాలా ఎక్కువగా ఉన్నాయని సెన్సార్ బోర్డు తెలిపింది.
రజినీకాంత్ నటించిన సినిమాలకు దాదాపు 36 సంవత్సరాల తర్వాత 'A' సర్టిఫికెట్ రావడం విశేషం. దీనివల్ల 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి అనుమతి ఉండదు. కూలీ సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలుగా ఉంది.
ఇక కూలీ సినిమా ఓవర్సీస్‌లో U/A' సర్టిఫికెట్ పొందింది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాలో హింస , యాక్షన్ సన్నివేశాలను చాలా వాస్తవికంగా చూపించారని, అందుకే భారతదేశంలో 'A' సర్టిఫికెట్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఉత్తర అమెరికాలో 'కూలీ' అడ్వాన్స్ బుకింగ్స్ రజినీకాంత్ మునుపటి చిత్రం 'జైలర్' రికార్డును బద్దలు కొట్టాయి. ప్రీమియర్ల కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమా ఇప్పటికే 1.12 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.ఇదే సమయంలో విడుదలవుతున్న హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' కంటే 'కూలీ' అడ్వాన్స్ బుకింగ్స్‌లో చాలా ముందుంది. వార్ 2 కేవలం 200k డాలర్లు మాత్రమే వసూలు చేసింది.
